క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. విదేశీ ఆటగాళ్లు సైతం ఐపీఎల్ లో ఆడేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఐపీఎల్ మాదిరి ఎన్నో దేశాలు ప్రీమియర్ లీగ్ లు నిర్వహిస్తున్నప్పటికీ పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. ఐపీఎల్ కు విదేశాలలో కూడా అభిమానులు ఉన్నారు. ఇప్పటికే 13 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇక 14వ సీజన్ కి అంతా సిద్ధమవుతోంది. గత ఏడాది కరోనా కారణంగా అరబ్ కంట్రీ లో ఐపీఎల్ 13వ సీజన్ ను నిర్వహించారు. అయితే ఈ ఏడాది ఇండియాలోనే ఐపీఎల్ జరగనుంది.. ఇప్పటికే జట్లు అన్ని తమతో ఉండే ఆటగాళ్ల వివరాలను వదిలేసిన ఆటగాళ్ల వివరాలను తెలిపాయి.

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు అయిన స్టీవ్ స్మిత్ ను వదిలేయడం అందరినీ షాక్ కు గురి చేసింది. స్టీవ్ స్మిత్ ఎంత నాణ్యమైన ఆటగాడో అందరికీ తెలిసిందే. దీంతో ఈ ఆటగాడిని దక్కించుకోవడానికి కోహ్లీ, ధోని జట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా యి. అలాగే రాజస్థాన్ రాయల్స్ లో ఉన్న మరో యువ సంచలనం సంజు శాంసన్ ను కూడా దక్కించుకునేందుకు ఆర్ సి బి, సిఎస్ కె, జట్లు పోటీ పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని ఆకాశ్ చోప్రా తెలిపాడు.

ఈ రెండు ఫ్రాంచైజీలు సంప్రదించిన తరువాతే రాజస్థాన్ రాయల్స్ కూడా సంజూ శాంసన్‌ను రిటైన్ చేసుకోవడమే కాకుండా జట్టులో అతని స్థాయిని పెంచాలని భావించింది. అందుకే శాంసన్‌ను తమ సారథిగా ప్రకటించింది. అలాగే స్టీవ్ స్మిత్ ‌ను వదులుకొని రాజస్థాన్ రాయల్స్ మంచి పనిచేసిందని అతనికి రూ.12.5 కోట్లు వెచ్చించడం అనవసరమని ఆశిష్ చోప్రా తెలిపాడు. తాజా వేలంలో అతని కోసం ఇంతకంటే ఎక్కువ వెచ్చిస్తే అంతకంటే పిచ్చి పని మరేది ఉండదు అని చెప్పుకొచ్చాడు.  దీంతో ఫిబ్రవరి 18న జరిగే మినీ వేలంలో ఏ జట్టు ఆటగాడిని దక్కించుకోనుంది అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: