ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ అవుటైన తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా టీమిండియా మాజీలు ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్యాచ్‌ను అవుట్‌గా ఎలా ఇస్తారంటూ థర్డ్ అంపైర్‌పై మండిపడుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా అంపైర్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘ఇది అవుట్ ఎలా అవతుంది..?’ అంటూ ప్రశ్నించాడు.

టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి రెండు వికెట్లను త్వరగానే కోల్పోయింది. రోహిత్ శర్మ(12), కేఎల్ రాహుల్(14) మళ్లీ నిరాశపరిచారు. కాగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావల్సిన కోహ్లీ బదులు సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకొచ్చాడు. వచ్చీరావడంతోనే తొలి బంతినే సిక్స్‌గా మలిచాడు. అవతలి వైపు రాహుల్, కోహ్లీ(1) వెంటవెంటనే అవుటైనా.. రిషబ్ పంత్(30)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే 57 పరుగుల వద్ద శామ్ కర్రాన్ బౌలింగ్‌లో స్క్వేర్‌ లెగ్ దిశగా బౌండరీ బాదేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ బంతి అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్ మలాన్ చేతిలోకెళ్లింది. అయితే దానిని మలాన్ పట్టుకున్నప్పటికీ బంతి నేలను తాకిందని అంపైర్లు అనుమానం వ్యక్తం చేశారు. థర్డ్ అంపైర్‌కు వెళ్లడంతో చెక్ చేసిన అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. దీనిపైనే ఇప్పుడు వివాదం రాజుకుంటోంది.

బంతిని మలాన్ అందుకున్న సమయంలో బంతి నేలకు తాకినట్లు కనిపిస్తోంది. థర్డ్ అంపైర్ ఇంత చిన్న విషయాన్ని ఎలా మిస్ అయ్యాడంటూ టీమిండియా మాజీలు విమర్శింస్తున్నారు. కాగా.. మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది.స్కై అవుటైన తరువాత క్రీజులోకొచ్చిన శ్రేయాస్ అయ్యర్(37) మొదట నెమ్మదిగా ఆడినా.. ఆ తరువాత బ్యాటు ఝుళిపించాడు. హార్దిక్ పాండ్యా(11) త్వరగా అవుటైనా.. శార్దూల్ ఠాకూర్(10) కూడా రెండు బౌండరీలు బాదడంతో టీమిండియా 180 దాటింది. కాగా.. హార్దిక్ ప్యాండ్యా(11) ఇండియా  186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ పోరాడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: