వెస్టిండీస్-శ్రీలంక మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. అందులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్‌వెల్లా విండీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నాడు. అయితే 96 పరుగుల వద్ద కీమా రోచ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో టెస్టుల్లో అతడి 17వ అర్థ సెంచరీ పూర్తయింది. దీంతో ఏకంగా ఓ వరల్డ్ రికార్డును సైతం డిక్‌వెల్లా బద్దలు కొట్టాడు. అదేటంటే టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా లేకుండా అన్ని అర్థ సెంచరీలు బాదిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఇండియన్ బ్యాట్స్‌మన్ చేతన్ చౌహాన్ పేరున ఉండేది. అతడు ఒక్క సెంచరీ కూడా లేకుండా 16 అర్థ సెంచరీలు సాధించాడు.
ఇదిలా ఉంటే విండీస్-శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక దారుణంగా 169 పరుగులకే ఆలౌటైంది. కాగా.. విండీస్ 271 పరుగులు చేసి 102 పరుగుల ఆధిక్యం సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక ధాటిగా ఆడి ఏకంగా 476 పరుగులు సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్ 236 పరుగులు చేసి 4 వికెట్లు మాత్రమే కోల్పోయింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి