భారత జట్టులో చోటు దక్కించుకోవడం కోసం ప్రతి క్రికెట్ ఆటగాడు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.  ఇక భారత జట్టులో చోటు దక్కిన సమయంలో తమ ప్రతిభను చాటుకుని జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు.  మరికొంత మంది ఆటగాళ్లకు మాత్రం ఎందుకొ టైం అంతగా కలిసి రాదు. కొన్నిసార్లు అంతర్జాతీయ భారత జట్టులో అవకాశం వచ్చినప్పటికీ.. అటు  తుది జట్టులో మాత్రం చోటు దక్కగా నిరాశ చెందుతుంటారు. ఇలా గత కొన్ని రోజుల నుంచి భారత జట్టులో సరైన అవకాశం రాక నిరాశలో మునిగిపోయాడు  చైనా మన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.


 ఒకప్పుడు భారత జట్టులో కీలక స్పిన్నర్ గా ఎన్నో రోజుల పాటు అద్భుతంగా రాణించిన కుల్దీప్ యాదవ్.. ఆ తర్వాత తన ఫామ్ కోల్పోయాడు.  ఈ క్రమంలోనే పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు.  ఇక ఆ తర్వాత బిసిసిఐ కుల్దీప్ యాదవ్ కు అవకాశాలు ఇవ్వడం తగ్గించింది.  ఐపీఎల్ లో కూడా కుల్దీప్ యాదవ్ కు నిరాశే ఎదురయింది. ఐపీఎల్లో ఎంపిక అయినప్పటికీ తుది జట్టులో మాత్రం ఆడలేకపోయాడు కుల్దీప్ యాదవ్.  పలుమార్లు తన బాధను సోషల్ మీడియా వేదికగా వెళ్లిబుచ్చాడు.  ఇక ఇటీవలే వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో తనకు చోటు దొరుకుతుంది అని అనుకున్నప్పటికీ చివరికి నిరాశే ఎదురయింది అంటూ కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు.



 అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లిన భారత జట్టులో చోటు దక్కకపోయినప్పటికీ అటు శ్రీలంక పర్యటనకు వెళ్లే యంగ్ టీమిండియా జట్టులో మాత్రం చోటు దక్కించుకున్నాడు కుల్దీప్ యాదవ్. లంక పర్యటన కోసం భారత జట్టులో తనకు అవకాశం దక్కడం సంతోషంగా భావిస్తున్నాను అని తెలిపాడు కుల్దీప్ యాదవ్. ఇక ఇన్నాళ్ళకి తనకు బాగా రాణించే అవకాశం వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అంటూ తెలిపాడు ఈ స్పిన్నర్.

మరింత సమాచారం తెలుసుకోండి: