ఈ మధ్యకాలంలో మందుబాబులు తెగ రెచ్చిపోతున్నారు కాస్త సమయం దొరికింది అంటే చాలు ఇక దుకాణం మొదలు పెట్టేస్తున్నారు. ముఖ్యంగా ఎంతో మంది లాక్డౌన్ సమయంలో ఇళ్లలోనే ఉండిపోవడంతో ఇక దొరికిన సమయాన్ని మొత్తం మద్యం తాగుతూ గడిపేస్తున్నారు. అయితే మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం అందరికీ తెలిసు.. కానీ ఎవరు కూడా మద్యం తాగకుండా ఉండడానికి ఏమాత్రం ఇష్టపడరు. అయితే సాధారణంగా ఎవరైనా మద్యంలో  నీళ్లు కలుపుకొని తాగుతూ ఉంటారు. కానీ ఎక్కువ మంది మాత్రం ఇక మద్యం లో సోడా మిక్స్ చేస్తే అసలైన టేస్ట్ వస్తుంది అని భావిస్తూ ఉంటారు.



 అందుకే ఎంతోమంది మద్యం లో సోడా మిక్స్ చేసుకొని తాగుతూ ఉంటారు.  అయితే ఇలా సోడా మిక్స్ చేసుకొని ఆగడం అస్సలు మంచిది కాదని  నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగానే మద్యం తాగడం మంచిది కాదు. మద్యం ఎక్కువగా తాగితే లివర్ పాడవుతుంది.  చివరికి ప్రాణాల మీదికి వస్తుంది. అదే మద్యం లో సొడా కలుపుకొని తాగితే ఇక మంరింత ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్నారు వైద్యులు. సొడా శరీరంలో ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది అంటూ చెబుతున్నారు.  సొడా ఒక్కసారి శరీరంలోకి వెళ్లిన తర్వాత చెడు బ్యాక్టీరియా ఎదుగుదలకు ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.




 అంతేకాదు తెల్ల రక్త కణాలపై కూడా ఎంతగానో ప్రభావం చూపుతుందని.. తద్వారా తరచూ సోడా తాగే వ్యక్తుల్లో రోగ నిరోధక శక్తి కూడా క్రమ క్రమంగా తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు.  అంతేకాదు సోడా లో ఉండే షుగర్ తో కూడా టైప్ 2 డయాబెటిస్ బారినపడే అవకాశం ఉంది అంటూ హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువగా సోడా తీసుకోవడం వల్ల అటు ఊబకాయం వచ్చే అవకాశం కూడా ఉంటుందట. మరో వైపు కడుపులో మంటకు కూడా కారణం అవుతుంది అని చెబుతున్నారు వైద్యనిపుణులు. అందుకే సోడా కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: