సౌతాంప్టన్‌లోని అగాస్ బౌల్‌లో ప్రారంభ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటిసి) ఫైనల్‌లో టీమిండియా న్యూజిలాండ్‌తో మ్యాచ్ కి దిగే ముందు, పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై షాకింగ్ ఆరోపణలు చేశాడు.  రవిచంద్రన్‌ అశ్విన్‌తో పాటు బీసీసీఐపై కూడా అజ్మల్ ఆరోపణలు చేశాడు. అనుమానిత బౌలింగ్‌ కారణంగానే అశ్విన్‌ను బీసీసీఐ కాపాడిందని, లేకపోతే అతనిపై నిషేధం ఖచ్చితంగా పడేదని అజ్మల్ వెల్లడించాడు. 


అయితే స్పిన్‌ బౌలర్‌ భుజం 15 డిగ్రీలు వంపు తిరగాల్సిందేనని చెబుతూ ఐసీసీ విధించిన ఆంక్షల నేపథ్యంలో అజ్మల్‌ ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఓ స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజ్మల్‌ మాట్లాడుతూ బీసీసీఐ పుణ్యమాని అశ్విన్‌ నిషేధం బారిన పడకుండా బయటపడ్డాడని అన్నారు. అలానే పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)లో ఇలాంటి పరిస్థితి ఉండదని, వారికి తమ ఆటగాళ్ల భవిష్యత్తు కంటే డబ్బే ముఖ్యమని చెప్పుకొచ్చాడు. 


అనుమానాస్పద బౌలింగ్ చర్యలు కలిగిన కారణంగా అజ్మల్‌పై ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. రైట్ హ్యాండ్ ఆఫ్‌ స్పిన్నర్‌ అయిన అజ్మల్‌ పాక్‌ తరఫున 2008-15 మధ్య కాలంలో 35 టెస్ట్‌లు, 113 వన్డేలు, 64 టీ20లు ఆడి మొత్తంగా 447 వికెట్లు తీశారు. మరో పక్క ఐసిసి యొక్క కఠినమైన 15 డిగ్రీల ఆర్మ్ బెండింగ్ నియమాన్ని అజ్మల్ నిందించాడు. “మీరు ఎవరినీ అడగకుండా ఈ నియమ నిబంధనలన్నీ మార్చారు. నేను గత ఎనిమిదేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాను. ఆ నియమాలన్నీ నా కోసమే. అంతే, ”అని అజ్మల్ క్రిక్‌విక్‌కు ఇచ్చిన యూట్యూబ్ ఇంటర్వ్యూలో అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

wtc