ప్రస్తుతం యంగ్ టీమ్ ఇండియా జట్టు శ్రీలంక పర్యటనకు బయలుదేరింది.  అయితే రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి లేకుండానే శిఖర్ ధావన్ కెప్టెన్సీలో యువ ఆటగాళ్లు అందరూ కూడా శ్రీలంక జట్టుతో తలపడనున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా పర్ఫామెన్స్ ఎలా ఉండబోతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది. ఇటీవలే ముంబైలో 14 రోజుల క్వారంటైన్ పూర్తిచేసుకుని టీమిండియా జట్టు ప్రత్యేకమైన ఫ్లైట్లో కొలంబో అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టింది. మొదటి నుంచి శ్రీలంక టీమ్ ఇండియా మధ్య జరగబోయే సిరీస్లకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.



 ఇక భారత్ శ్రీలంక పర్యటనకు బయలుదేరడానికి ముందే శ్రీలంక జట్టు ఇంగ్లండ్ పర్యటన ముగించుకుని వచ్చింది. అటు వెంటనే ఇంగ్లండ్ ఆటగాళ్లు వైరస్ బారిన పడ్డారు  దీంతో లంక జట్టు ఆటగాళ్లు వైరస్ బారిన పడే అవకాశం ఉంది  అని పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అనుకున్నదే అయ్యింది. జట్టులోని పలువురు సభ్యులు వైరస్ బారిన పడ్డారు. దీంతో చేసేదేమీ లేక భారత్ శ్రీలంక మధ్య జరగబోయే వన్డే,టి20 సిరీస్ షెడ్యూల్లో మార్పులు చేసే పరిస్థితి వచ్చింది. ఇక ఇటీవల కరోనా వైరస్ కారణంగా సిరీస్ ని ఐదు రోజుల పాటు వెనక్కి జరుపుతూ ఇటీవల క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇటీవలే పూర్తి స్థాయి షెడ్యూల్ ని కూడా ప్రకటించింది లంక క్రికెట్ బోర్డు.



 పాత షెడ్యూల్ ప్రకారం అయితే ఈనెల 13వ తేదీ నుంచి సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ నెల 18వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో మ్యాచ్ టైమింగ్స్ లో కూడా మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది లంక బోర్డు.. 18,20,23 తేదీలలో వన్డే సిరీస్ లోని మూడు మ్యాచ్లు జరగనున్నాయి. ఇక ఆ తర్వాత 25,27, 29 తేదీలలో టి20 సిరీస్ లోని మూడు మ్యాచ్లు జరగనున్నాయి. ఇక మ్యాచ్ టైం విషయానికి వస్తే పాత షెడ్యూల్ ప్రకారం అయితే రెండు గంటల 30 నిమిషాలకు వన్డే ప్రారంభం కావాల్సి ఉంటుంది. కానీ కొత్త షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక టి20 మ్యాచ్ కూడా రాత్రి 7 గంటలకు కాకుండా ఎనిమిది గంటలకి స్టార్ట్ అవుతుందని లంక క్రికెట్ బోర్డు కొత్తగా విడుదల చేసిన షెడ్యూల్లో స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: