మరికొన్ని రోజులలో క్రీడాల పండుగ ఒలంపిక్స్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఇక అన్ని దేశాల ఆటగాళ్లు ఇప్పటికే టోక్యో నగరం కి చేరుకొని ఇక అక్కడ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. ఇక తమ దేశం తరఫున  ప్రాతినిధ్యం వహించి గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా అందరు ఆటగాళ్లు మరికొన్ని రోజుల్లో బరిలోకి దిగబోతోతున్నారు. అయితే ఇంతకు ముందు నిర్వహించిన ఒలంపిక్స్ కంటే ఇక ఇప్పుడు నిర్వహించే ఒలంపిక్ ఎంతో సవాల్తో కూడుకున్నది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే కరోనా వైరస్ ప్రభావం తగ్గక పోయినప్పటికీ ఇక ఒలంపిక్స్ నిర్వహించేందుకు జపాన్ ప్రభుత్వం నిర్ణయించడం ఒక పెద్ద సాహసం అని చెప్పాలి.



 ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి వేల సంఖ్యలో క్రీడాకారులు తరలివస్తుంటారు. ఇక వారి వెంట సిబ్బంది కోచ్ లు కూడా ఉంటారు. ఇలా అందరికీ కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఒలంపిక్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇలా ఒలంపిక్స్ లో పాల్గొనడానికి వచ్చే ఆటగాళ్లకు ప్రతి సారీ కూడా అక్కడి ప్రభుత్వం కండోమ్స్ పంపిణీ చేయడం లాంటివి చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఒలంపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులు అందరు కూడా సురక్షితమైన శృంగారం చేయాలనే ఉద్దేశంతో ఇలా కండోమ్స్ పంపిణీ చేస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా అటు కండోమ్స్ పంపిణీ చేసినప్పటికీ శృంగారంపై మాత్రం నిషేధం విధించింది.




 అయితే ఆటగాళ్ళు శృంగారంలో పాల్గొన కుండా ఉండేందుకు ఇక ఇప్పుడు ఏకంగా వినూత్న ఆలోచన చేసింది అక్కడి ప్రభుత్వం.ఏకంగా ఒలింపిక్స్ లో పాల్గొనే ఆటగాళ్ల అందరికీ కూడా యాంటీ సెక్స్ బెడ్స్ ఏర్పాటు చేసింది. ఇక ఈ బెడ్ పై శృంగారం చేయడం గాని ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులు పడుకోవడం గానీ అస్సలు కుదరదు. ఇక ఈ బెడ్ ఏ మాత్రం కదిలినట్లు అనిపించినా మంచం విరిగి పోతుందట. కేవలం అట్టతో మాత్రమే ఈ బెడ్ తయారు చేస్తారు. ఇక ఇలాంటి బెడ్ ని ప్రస్తుతం ఒలింపిక్స్లో పాల్గొనే క్రీడాకారుల అందరికీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి ఆటగాళ్ళు ఎవరితో కూడా శృంగార చేయకూడదు అనే ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకుందట అక్కడి ప్రభుత్వం. అయితే వీటిని వాడిన తర్వాత సులభంగా రీసైకిల్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: