టోక్యో ఒలంపిక్స్ లో ఒకే ఒక పతకం గెల్చుకుని దేశం మొత్తం గర్వపడేలా చేసిన మీరాబాయ్ చాను గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అదృష్టం కలిసొస్తే మీరా బాయి చాను రజత పతకం కాస్త బంగారు పతకంలా మారిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరా బాయి చాను రజత పతకం గెలవగా... చైనా చిన్నది జీహో జీజీ స్వర్ణ పతకాన్ని ఎగరేసుకుపోయింది. కానీ ప్రస్తుతం జీజీని టోక్కో ఒలంపిక్ నిర్వాహకులు డోప్ టెస్టు చేయించుకోవాలని ఆదేశించారు. ఒక వేళ జీజీ డోప్ టెస్టులో విఫలమైతే కనుక మన దేశపు వెండి కొండ బంగారు కొండగా మారే అవకాశం ఉంది.


ఈ వార్తను ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ తెలియజేసింది కావున వార్త నిజమా కాదా అని ఎటువంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జీహో జీజీని టోక్యో ఒలంపిక్ కమిటీ డోప్ టెస్టు చేయించుకోమని సూచించినట్లు ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. కాగా వెండి పతకాన్ని సాధించిన మన దేశ అమ్మాయి మీరా బాయి టోక్యోను వదిలి స్వదేశానికి తిరిగివచ్చింది. కానీ బంగారు పతకం గెలిచిన చైనాకు చెందిన జీజీని మాత్రం డోప్ టెస్టు అయిపోయే వరకు టోక్యో విడిచి వెళ్లరాదని నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఒక్కసారిగా జీజీని డోప్ టెస్టు చేయించుకోమని నిర్వాహకులు ఆదేశించడంతో మన వెండి తల్లికి బంగారు పతకం సాధించేందుకు ఏమైనా అవకాశం ఉందా ఈ విషయం తెలిసిన వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక వేళ జీజీ గనుక డోప్ టెస్టులో ఫెయిలయితే మీరా బాయి చాను బంగారు పతకం గెలవడం ఖాయం అని  అందరూ చర్చించుకుంటున్నారు. మూడో స్థానంతో సరిపెట్టుకున్న ఇండోనేషియాకు చెందిన విండీ కాంటిక వెండి పతకాన్ని కైవసం చేసుకోనుంది. మీరా బాయి ప్రదర్శనతో దేశంలోని యావత్ క్రీడాకారులతో పాటు అందరూ సగర్వంగా తలెత్తుకుని మేరా భారత్ మహాన్ అని నినదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: