అయితే రాజస్థాన్ జట్టు గత మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించి ఈ ప్లేఆఫ్ రేసులో నిలిచింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో మొదట కొంత తడబడిన రాజస్థాన్ జట్టు ప్రస్తుతం మంచి ప్రదర్శన కనబరుస్తుంది. యూఏఈ వేదికగా ఐపీఎల్ ఆరంభమైన సమయం నుండి ఆ జట్టుకు ఓపెనర్ గా వస్తున్న యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. గత మ్యాచ్లో చెన్నై పై విజయం సాధించడంలో 19 బంతుల్లో అర్థ శతకం చేసి ఈ యువ ఓపెనర్ కీలకపాత్ర పోషించాడు. అలాగే ఆ తర్వాత రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ఈ సీజన్ మొదటినుండి మంచి ప్రదర్శన చేస్తున్నాడు. అయితే కొన్ని మ్యాచ్ లో అతనొక్కడే ఆడటంతో ఫలితం లేకుండా పోయింది. కానీ ప్రస్తుతం రాజస్థాన్ జట్టు మొత్తం కలిసి ఆల్ రౌండర్ ప్రదర్శన చేస్తోంది. ఇక గత మ్యాచ్లో అర్థ శతకం సాధించిన శివమ్ దూబే మంచి టచ్ లో ఉన్నాడు. అయితే బ్యాటింగ్ లో లో బాగా కనిపిస్తున్నా రాజస్థాన్ బౌలింగ్ లో కొంత నిరాశ పరుస్తుంది. ఒక మ్యాచ్లో రాణించిన బౌలర్ ఆ తర్వాత మ్యాచ్ లో చేతులెత్తేస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో ఎవరో ఒక్కరే మంచి బౌలింగ్ చేస్తుండటం ఆ జట్టుకు నష్టాన్ని కలిగిస్తుంది. అయితే ఈ రోజు ముంబై జట్టుపై ఎవరు రాణిస్తారు అనేది తెలియదు.
ఇక డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ లో అంతగా ఆకట్టుకోలేక పోతుంది. ప్రత్యర్థి జట్టు లను తక్కువ పరుగులకే కట్టడి చేసిన ఆ లక్ష్యాన్ని ముంబై చేధించలేక పోతుంది. ప్రస్తుతం యూఏఈ లో ఈ జట్టు బ్యాటింగ్ పూర్తిగా విఫలమవుతోంది. ఒంటి చేతితో మ్యాచ్ ను మలుపు తిప్పగల హిట్టర్లు ఎంతో మంది జట్టులో ఉన్న ముంబై ఈసారి బ్యాటింగ్లో విఫలమవుతుంది. కనీసం 150 పరుగుల లక్ష్యాన్ని కూడా చేధించ లేక పోతుంది. అయితే ఆ జట్టు బౌలింగ్ లో కూడా బుమ్రా ఒక్కడే నిలకడగా రాణిస్తున్న మిగతావారు ఆకట్టుకోలేక పోతున్నారు. అయితే ఆల్ రౌండర్ కీరన్ పోలార్డ్ బౌలింగ్లో రాణిస్తుండడం ఒక్కటే ముంబై జట్టుకు కలిసి వచ్చే అంశం.
ఇక ఈ రెండు జట్లు యూఏఈ వేదికగా ఆడిన మ్యాచ్ లను చూస్తుంటే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు విజయం సాధించేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కానీ ముంబై జట్టులో ఎవరు ఎప్పుడు ఎలా ఆడతారో తెలియదు. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ లో నిలుస్తుండటంతో ముంబై జట్టు పుంజుకొని ఈ మ్యాచ్లో బాగా ఆడితే ఎవరు విజయం సాధిస్తారో చెప్పలేము.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి