భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఐసిసి టీ20 ప్రపంచకప్ 2021 నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో గ్రూప్ 2 లో ఉన్న భారత జట్టు తన మొదటి మ్యాచ్ ను ఈ నెల 24న అదే గ్రూపులో ఉన్న పాకిస్థాన్ జట్టుతో ఆడనుంది. అయితే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంతో ఆతృతగా ఎదురు చూసే అభిమానులు గతంలో ఈ రెండు జట్లు తలపడగా సమయంలోని కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. అందులో భారత పేసర్ వెంకటేశ్ ప్రసాద్ అలాగే పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఆమిర్ సోహైల్ మధ్య జరిగిన ఘటన తప్పకుండా అందరికీ గుర్తుకు వస్తూ ఉంటుంది.

అయితే ఇప్పుడు ఆ వెంకటేష్ ప్రసాద్ మన భారత జట్టులోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన జస్ప్రిత్ బూమ్రా గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా ఎకానమీ రేట్ పరంగా కూడా ఒక గొప్ప బౌలర్ అని వెంకటేష్ ప్రసాద్ అన్నాడు. బూమ్రా ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న గొప్ప బౌలర్లలో ఒకడు. అతను క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలో తన ప్రభావాన్ని చూపించాడు. బూమ్రా ఇప్పటికే టెస్టుల్లో 101, వన్డేల్లో 108, టి20 లో 59 వికెట్లు సాధించాడు. అయితే బుమ్రా తాను సంధించే బంతుల వేగం పరంగానే కాకుండా ఎకానమీ పరంగా కూడా అద్భుతమైన బౌలర్ అని వెంకటేష్ ప్రసాద్ అన్నాడు.

అయితే ఈ ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ మరో భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ గురించి మాట్లాడుతూ... భువనేశ్వర్ యొక్క ఎకానమీ రేట్ అద్భుతంగా ఉంది. అతను మొదట పవర్ ప్లే లో అలాగే చివర్లో డెత్ ఓవర్లలో వేసే బౌలింగ్ కు మనం వెలకట్టలేము .అతను ఓ గొప్ప ఎకానమీ బౌలర్ అని చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వెంకటేష్ ప్రసాద్ బూమ్రా కూడా ఒక మంచి ఎకానమీ బౌలర్ తెలిపాడు. ఇక ఈ ఇద్దరూ ప్రపంచ కప్ లో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తే మన జట్టుకు పేస్ బౌలింగ్ లో తిరుగు ఉండదు అనేది అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: