ఇక మరికొంతమంది అటు టీవీల ముందు కూర్చుని మ్యాచ్ వీక్షిస్తూ వుండటం గమనార్హం. కాగా టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇప్పటికే సెమీ ఫైనల్లో స్థానం దక్కించుకున్న జట్లు ఏవి అన్న విషయంఫై దాదాపుగా అందరికీ క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పటికే పలు జట్లు వరుస ఓటముల కారణంగా సెమీ ఫైనల్లో స్థానం దక్కించుకోలేక ఇంటి బాట పట్టయ్. కేవలం టి20 వరల్డ్ కప్ లో భాగంగా పరువు నిలబెట్టుకోవడానికి మాత్రమే మ్యాచ్ ఆడుతూ ఉండటం గమనార్హం. ఇదే సమయంలో కొన్ని జట్లు ఇంకా సెమీ ఫైనల్లో స్థానం దక్కించుకోవడానికి క్లిష్ట పరిస్థితిలో ఉండగా ఇక వరుసగా మ్యాచ్ లలో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు ఒక ఆసక్తికర మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్లో భాగంగా ఒక జట్టు సెమీ ఫైనల్లో స్థానం దక్కించుకోవడానికి తలపడుతూ ఉండగా.. మరో జట్టు టి-20 వరల్డ్ కప్ లో పరువు నిలబెట్టుకోవడానికి తలపడుతుంది. నేడు టి20 వరల్డ్ కప్ లో భాగంగా గ్రూప్ వన్ నుంచి సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగబోతోంది మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు వరకు సౌత్ ఆఫ్రికా జట్టు మూడు మ్యాచ్లు ఆడగా రెండింటిలో విజయం సాధించింది. దీంతో సెమీ ఫైనల్లో స్థానం తగ్గించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ మ్యాచ్లో గెలవాల్సి ఉంది. అదే సమయంలో బంగ్లాదేశ్ జట్టు ఇప్పుడు వరకు ఆడిన మూడు మ్యాచ్ లు కూడా ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం పరువు నిలబెట్టుకోవడానికి నేడు సౌతాఫ్రికాతో పోరు కొనసాగించబోతుంది
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి