ఇలాంటి సమయంలో అటు టీమిండియా ప్రదర్శనపై కాదు ఏకంగా న్యూజిలాండ్ ప్రదర్శనపై టీమిండియా భవిష్యత్తు ఆధారపడి ఉంది. టీమ్ ఇండియా సెమీ ఫైనల్కు చేరుకోవడం లేకపోతే బ్యాగ్ సర్దుకుని ఇంటి ముఖం పట్టడం అన్నది కేవలం న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల చేతిలోనే ఉంది అని చెప్పాలి. ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ టీమ్ ఇండియా కు కూడా ఎంతోకీలకంగా మారబోతుంది.. ఇక ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓడిపోవాలని భారత ప్రేక్షకుల మాత్రమే కాదు భారత క్రికెటర్లు కూడా కోరుకుంటున్నారు.
అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కీలక స్పీకర్గా ఉన్న ముజీబ్ గాయం బారినపడి కోలుకుంటున్నాడు. ఇంకా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదు. ఈ క్రమంలోనే మ్యాచ్ సమయం వరకు ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ కోలుకోవాలంటు భారత ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం రషీద్ ఖాన్, మహమ్మద్ నబి లతో ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉన్నప్పటికీ వారికి ముజీబ్ కలిస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతుందని అప్పుడు న్యూజిలాండ్ ఓడిపోయే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ఇదే విషయంపై స్పందించిన భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కావాలంటే ముజీబ్ కోలుకోవడానికి భారత్ నుంచి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ని కూడా పంపిస్తాను అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక కామెంట్ చేశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి