ఒకప్పుడు బీసీసీఐ ఆటగాళ్ల ఫుడ్ మెనూ లో పంది మాంసం ఎద్దు మాంసం లాంటివి కూడా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి వాటిని ఫుడ్ మెనూ నుంచి తొలగిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. ఇక ఇటీవలే బీసీసీఐ తీసుకున్న నిర్ణయం కొంతమంది క్రికెట్ ఆటగాళ్ళ కి షాక్ ఇచ్చింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొత్త డైట్ ప్లాన్ ప్రకారం టీమిండియా ఆటగాళ్లు ఎవరు కూడా పంది మాంసం ఎద్దు మాంసం తినకూడదు అంటూ ఇటీవలే ఆంక్షలు విధించి నట్లు తెలుస్తోంది. హలాల్ చేసిన మాంసం తినడానికి మాత్రమే ఆటగాళ్లను అనుమతిస్తున్నట్లు ఫ్రీ ప్రెస్ జనరల్ తెలిపింది.
భారత ఆటగాళ్లందరూ మరింత ఫిట్‌గా ఆరోగ్యంగా ఉండేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే హలల్ చేసిన ఆహారాన్ని మాత్రమే తినాలి అంటూ బిసిసిఐ నిబంధన అమలులోకి తీసుకు రావడం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. బిసిసిఐ లాంటి నిబంధన తెరమీదకు తీసుకురావడం ఏంటి అనీ అంటూ అందరూ తీవ్రస్థాయిలో విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక రానున్నఇక ఈ కొత్త డైట్ ప్లాన్ విషయంలో బిసిసిఐ ఏమైనా వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయ్ అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం బీసీసీఐ తీసుకున్న నిర్ణయం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.