ఒకప్పుడు క్రికెట్ కామెంటేటర్ గా  తన వాక్చాతుర్యంతో ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులను అలరించిన రవిశాస్త్రి ఆ తర్వాత మాత్రం టీమిండియా హెడ్ కోచ్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే అనిల్ కుంబ్లే విరాట్ కోహ్లి మధ్య విభేదాలు రావడంతో చివరికి బీసీసీఐ రవిశాస్త్రిని కొత్త హెడ్ కోచ్గా నియమించింది. అయితే రవిశాస్త్రి హెడ్ కోచ్ గా నియమించడంపై అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. క్రికెట్ లో ఎక్కువ అనుభవం లేని రవిశాస్త్రిని కోచ్ గా నియమించడం ఏంటి అంటూ ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా అని ప్రశ్నించారు.


 అయినప్పటికీ అటు రవిశాస్త్రి మాత్రం తన కోచింగ్లో టీమిండియాను ఎంతో సమర్థవంతంగా నే ముందుకు తీసుకెళ్ళాడు. రవిశాస్త్రి కోచింగ్ లో టీమిండియా ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించింది అని చెప్పాలి. చారిత్రాత్మక గబ్బా టెస్టులో సైతం విజయం సాధించింది భారత జట్టు. కానీ రవిశాస్త్రి కోహ్లీ కాంబినేషన్లో  టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ మాత్రం గెలవలేకపోయింది. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో సైతం ఓడిపోయి నిరాశపరిచింది. అయితే రవిశాస్త్రి కోచింగ్ లో అటు టీమిండియా అద్భుతంగా రాణించినట్టు గానే చెత్త ప్రదర్శనలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.


 ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్ పదవీ సమయం ముగియడంతో రవిశాస్త్రి కోచ్గా తప్పుకున్నాడు. తర్వాత టీమిండియాతో  తన ప్రయాణం గురించి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు రవిశాస్త్రి. ఇటీవలే శాస్త్ర పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారిపోయింది. తన కోచింగ్లో టీమిండియా  ఒకానొక సమయంలో చెత్త ప్రదర్శన చేసింది చెప్పుకొచ్చాడు. అడిలైడ్లో ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్ట్ టీమిండియా 36 పరుగులకే అలౌట్ అయ్యి కుప్పకూలడం కోచ్ గా తన పదవీ కాలంలో అత్యంత దారుణం అంటూ తెలిపాడు. తర్వాత కొన్ని రోజుల పాటు తాము షాక్ లో ఉండి పోయాము అంటూ చెప్పుకొచ్చాడు రవి శాస్త్రి. తన కోచ్ కెరియర్లో ఇక ఈ ప్రదర్శన ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: