కానీ రెండో ఇన్నింగ్స్లో కూడా ఇదే ఆటతీరును కనబరుస్తూ తీవ్రస్థాయిలో నిరాశపరుస్తుంది.. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం అద్భుతంగా రాణిస్తూ భారీగా పరుగులు చేస్తూ ఉండటం గమనార్హం. ఇటీవలే తొలి ఇన్నింగ్స్ లో భాగంగా 473 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది ఆస్ట్రేలియా.. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే మొదట్లోనే ఇంగ్లాండుకు ఎదురుదెబ్బ తగిలింది కేవలం 12 పరుగుల వద్ద ఇంగ్లండ్ జట్టు ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది. ఇక ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన కెప్టెన్ జో రూట్ 62 పరుగులు, డేవిడ్ 84 పరుగులు చేసి 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు..
ఈ సమయంలో అటు ఇంగ్లాండ్ జట్టు కాస్త పటిష్టంగానే కనిపించింది అని చెప్పాలి. కానీ ఇద్దరూ వికెట్ కోల్పోయిన వెంటనే అటు ఇంగ్లాండ్ బ్యాటింగ్ విభాగం మొత్తం పేకమేడలా కుప్పకూలిపోయింది. స్టొక్స్ 34 పరుగుల మినహా మిగతా ఎవ్వరూ కూడా పెద్దగా రాణించలేదు అనే చెప్పాలి. కేవలం 84 పరుగుల వ్యవధిలోనే ఆరు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో మునిగిపోయింది ఇంగ్లండ్ జట్టు.. చివరికి 236 పరుగులకు ఆలౌట్ అయింది ఇంగ్లాండ్. దీంతో ఆస్ట్రేలియాకు ఏకంగా 237 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ సొంత జట్టు ప్రదర్శనపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు. ఈ రోజు మా ఆట తీరు మొత్తం ఎంతో దురదృష్టకరంగా సాగిపోయింది. అయితే అన్లక్కీ అనే పదం ఇక్కడ వాడకూడదు. అన్ని తెలిసి మ్యాచ్లో కొన్ని చెత్త షాట్లు కొట్టి వికెట్లు చేజార్చుకున్నాము. మా ఆటతీరు లో నాణ్యత లోపించింది. సమిష్టిగా పరుగులు చేయడంలో విఫలం అయ్యానము నేను, జో రూట్ కలిసి 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాము. కానీ మిగతా ఆటగాళ్లు దానిని నిలబెట్టుకోలేక పోవటం.. కోపం చిరాకు తెప్పిస్తుంది. అయితే ఇప్పటికీ మాకు అవకాశాలు సన్నగిల్ల లేదు ఇంకా మా పోరాటం సాగిస్తూనే ఉంటాము అంటూ డేవిడ్ మాలాన్ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి