ఈ రోజు జొహాన్నస్ బెర్గ్ వేదికగా ఇండియా సౌత్ ఆఫ్రికాల మధ్యన రెండవ టెస్ట్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. కోహ్లీ గైర్హాజరీలో ఓపెనర్ బ్యాట్స్ మాన్ కె ఎల్ రాహుల్ కెప్టెన్ గా ఎంపికయిన విషయం తెలిసిందే. కెరీర్ లో తొలిసారి ఇండియా టెస్ట్ టీమ్ కు కెప్టెన్ అయ్యాడు. అయితే కెప్టెన్ అవ్వడం అంత కష్టం ఏమీ కాకపోయినా, ఒక సారధిగా టీం లోని మిగిలిన ఆటగాళ్ల నుండి సరైన ప్రదర్శన రాబట్టడం మీదనే వారి సత్తా ఆధారపడి ఉంటుంది. అయితే ఈ టెస్ట్ లో ఫేవరెట్ మాత్రం ఇండియానే, అయినా ఆరంభం నుండి తడబడుతూనే ఆడింది. అలా మొత్తానికి 63.1 ఓవర్లలో టీమిండియా 202 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

ఇండియా ఆటగాళ్లలో ఒక్క రాహుల్ తప్పించి మిగతా వారెవ్వరూ 50 పరుగులు కూడా చేయలేకపోయారు. రాహుల్ తర్వాత బౌలర్ అశ్విన్ మాత్రమే 46 పరుగులతో బ్యాట్స్ మాన్ కి ధీటుగా ఆడి విలువైన పరుగులు చేశాడు. సీనియర్ ఆటగాళ్లు అయిన పుజారా, రహానే మరియు పంత్ లు మరోసారి విఫలమయ్యారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లు గత టెస్ట్ కన్నా భిన్నంగా ఆడి ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. మొదటి బంతి నుండే ఇండియా ఆటగాళ్ళపై ఒత్తిడి పెంచారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మార్కో  జెన్సెన్ 4 వికెట్లు, రబడా 3 వికెట్లు మరియు ఒలివర్ 3 వికెట్లు సాధించి ఇండియా పతనాన్ని శాసించారు.  

అయితే ఇది చాలా తక్కువ స్కోర్ అని తెలుస్తోంది. ఇండియన్ బౌలర్లు చెలరేగితే తప్పించి ఇండియా ప్రమాదంలో ఉన్నట్లే. ఇక్కడ ఇదే స్టేడియంలో ఇండియాకు ఇది మూడవ అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. ఇక గత టెస్ట్ లో చెలరేగిన విధంగా చేస్తే ఇండియాకు సౌతాఫ్రికాను ఇంత కన్నా తక్కువ స్కోర్ కే కట్టడి చేయవచ్చు. కష్టాల్లో ఉన్న టీం ఇండియాను గట్టెక్కిస్తారా లేదా అన్నది తెలియాలంటే సెకండ్ ఇన్నింగ్స్ ముగిసే వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: