క్రికెట్ అంటేనే ఎంతో ఉత్కంఠ భరితమైన ఆట. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది కూడా ఊహకందని విధంగా ఉంటుంది. కొన్నిసార్లు  ఉత్కంఠభరితంగా  మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో జరిగే కొన్ని సన్నివేశాలు  ఏకంగా మన కళ్ళతో చూసిన నమ్మలేని  విధంగా ఉంటాయి. ముఖ్యంగా మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాళ్లు పట్టే అద్భుతమైన  క్యాచ్లు అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఏదైనా మ్యాచ్ జరుగుతున్న  సమయంలో ఎవరైనా ఆటగాళ్లు ఇలాంటి క్యాచ్ లు పట్టాడు అంటే చాలు క్రికెట్ ప్రపంచం మొత్తం దాని గురించి చర్చించుకుంటూ ఉంటుంది. ఇక అంతే కాదు ఇలాంటి స్టన్నింగ్ క్యాచ్ లకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి.



 సాధారణంగా పొట్టి ఫార్మాట్ అయిన టీ20 క్రికెట్ లో ఇలాంటి  అద్భుతమైన సన్నివేశాలు కనిపిస్తూనే ఉంటాయి. ప్రేక్షకులు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. కానీ ఇటీవలే భారత్ సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఇలాంటి ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ప్రస్తుతం జోహన్నెస్బర్గ్ వేదికగా రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో దక్షిణాఫ్రికా ఫీల్డర్ రాసి వాన్ డేర్ డస్సేన్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తుంది. వారెవ్వా ఎంత అద్భుతమైన క్యాచ్ పట్టాడు అంటూ ఈ వీడియో చూసిన వారు కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.



 ఇన్నింగ్స్ లో 39 ఓవర్ రబడా బౌలింగ్  వేస్తున్నాడు. ఇక ఆ సమయంలో హనుమ విహారి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక రబాడ వేసిన బంతిని హనుమ విహారి డిఫెండ్  చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ ఏడ్జ్ కి తాకింది. దీంతో ఊహించని విధంగా షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న రాసి వాన్ డేర్ డస్సేన్ కి కాస్త దూరంగా వెళ్ళింది. ఈ ఈ క్రమంలోనే  వెంటనే అప్రమత్తమైన ఫీల్డర్ గాల్లో స్పైడర్ మాన్ లా ఎగిరాడు. ఇక ఒంటి చేత్తో క్యాచ్ ఒడిసి పట్టాడు. ఇక చివరి వరకు క్యాచ్ పట్టుకుంటాడా వదిలేస్తాడా అని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ ఎక్కడా పొరపాటు చేయకుండా క్యాచ్ పట్టుకున్నాడు సౌతాఫ్రికా ప్లేయర్ రాసి వాన్ డేర్ డస్సేన్. దీనికి సంబంధించిన వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: