టీమిండియా నేడు సౌతాఫ్రికాతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. మొదటిసారి సౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం సాధించడమే లక్ష్యంగా సౌత్ఆఫ్రికా పర్యటనకు బయలుదేరిన టీమిండియా  ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు సిద్ధమైంది. ఎట్టి పరిస్థితుల్లో మూడవ టెస్ట్ మ్యాచ్లలో విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించడమే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది కోహ్లీ సేన. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్లలో ఇరు జట్లు కూడా ఒక్కో మ్యాచ్లో విజయం సాధించాయి. దీంతో మూడవ టెస్ట్ మ్యాచ్ విజేతను నిర్ణయించే కీలకమైన మ్యాచ్ గా మారిపోయింది.



 గాయం కారణంగా రెండవ టెస్ట్ మ్యాచ్ దూరమైన విరాట్ కోహ్లీ మూడో టెస్టులో జట్టుకు అందుబాటులోకి రావడంతో టీమిండియా ఇప్పుడు మరింత పటిష్టంగా కనిపిస్తోంది. ఇకపోతే  ఇక సౌత్ ఆఫ్రికా తో డు ఆర్ డై మ్యాచ్ ఆడబోతుంది టీమిండియా. అయితే భారత టెస్టు జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న యువ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ పేలవమైన ఫామ్ ప్రస్తుతం  అభిమానులను కలవర పెడుతోంది. ఇటీవలే రెండో ఇన్నింగ్స్ లో భాగంగా రిషబ్ పంత్ అనవసరమైన షాట్కు ప్రయత్నించి వికెట్ చేజార్చుకున్నాడు. ఒక్క పరుగు  కూడా చేయకుండానే పెవిలియన్  చేరాడు.


 అయితే పంత్ ఫామ్ గురించి మూడో టెస్టుకు ముందు మీడియా సమావేశంలో మాట్లాడాడు విరాట్ కోహ్లీ. మాజీ కెప్టెన్ ధోనీ నాకు ఒక సలహా ఇచ్చారు. ఇప్పటికీ అదే సలహాని ఫాలో అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆటగాళ్లు చేసే పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఏడు నుంచి ఎనిమిది నెలల సమయం ఇవ్వాలని.. అప్పుడే వాళ్లు తమ తప్పులు పై దృష్టి సారించి వాటిని అధిగమించేందుకు సాధ్యం అవుతుంది అంటూ ధోనీ చెప్పాడు. ఇక ఇప్పుడు పంత్ విషయంలో కూడా నేను అదే పాటిస్తున్నాను. ముందుకు వెళ్లే కొద్దీ అతని తప్పులను సరిదిద్దు కుంటాడు కచ్చితంగా భవిష్యత్తులో మంచి ప్రదర్శనలు చేస్తాడు అని నమ్మకం ఉంది అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: