విరాట్ కోహ్లీ అభిమానులందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు. గతంలోనే టి20 కెప్టెన్సీ నుంచి తప్పు కుంటున్నాను అంటూ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇక టి20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పిస్తూ  బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తాము ముందుగానే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు విరాట్ కోహ్లీ కి సమాచారం అందించాము అంటూ బిసిసిఐ చెప్పడం.. తనకు కేవలం గంట ముందు మాత్రమే సమాచారం ఇచ్చారంటూ విరాట్ కోహ్లీ చెప్పడంతో కెప్టెన్సీ మార్పు కాస్త పెద్ద వివాదంగా మారి పోయింది.


 అయితే ప్రస్తుతం పరిమిత ఓవర్ల  ఫార్మాట్కు రోహిత్ శర్మ కెప్టెన్గా.. టెస్ట్ క్రికెట్ కు మాత్రమే కెప్టెన్ గా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ.  పోనీలే విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్లో అయినా కెప్టెన్ గా కొనసాగుతున్నాడు అని అభిమానులు అందరూ ఆనందపడ్డారు. కానీ ఇటీవలే షాకింగ్ నిర్ణయం తీసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాడు. ఏకంగా తాను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు విరాట్ కోహ్లీ. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. తనకు ఇన్ని రోజుల వరకు సహకరించిన బిసిసిఐ కి కృతజ్ఞతలు తెలిపాడు.


 అయితే మొదటి నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి అంటూ రూమర్స్ అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయ్. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పించడంపై సౌరవ్ గంగూలీ ఎలా స్పందిస్తాడో అన్న విషయంపై అందరూ ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ఇటీవల విరాట్ క కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం పై స్పందించాడు బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ.  కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఎంతో వేగంగా ముందుకు వెళ్ళింది అంటూ చెప్పుకొచ్చాడు. అతని వ్యక్తిగత నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవిస్తుంది అంటూ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. కోహ్లీ ఒక గొప్ప ప్లేయర్ అని ఇకపైన జట్టు ప్రయాణంలో కీలకంగా ఉంటాడు అంటూ సౌరవ్ గంగూలీ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: