అయితే ఐపిఎల్ వేలానికి ముందుగా జరిగిన రిటెన్షన్ ప్రక్రియలో అత్యధికంగా కె ఎల్ రాహుల్ 17 కోట్లకు సొంతం చేసుకున్న ఆటగాడిగా పేరొందాడు. అయితే ఈ సారి ఐపిఎల్ వేలానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కొందరు మెగా ఆటగాళ్ళు వేలానికి డుమ్మా కొట్టారు. వారిలో 360 డిగ్రీస్ ప్లేయర్ ఎబి డివిలియర్స్ మరియు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ లు ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టీ 20 లీగ్ ల నుండి ఎందరో ప్లేయర్ లు తమదైన ఆటతో ఐపిఎల్ ఫ్రాంచైజీ ల దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఎవరూ ఊహించని రీతిలో ఈ వేలంలో అమ్ముడుబోయే 5 గురు ఆటగాళ్ళు ఎవరో చూద్దాం.
* వారిలో న్యూజిలాండ్ కు చెందిన అన్ క్యాప్డ్ ప్లేయర్ మైఖేల్ బ్రేస్ వెల్ అందరి దృష్టిలోనూ నిలుస్తున్నాడు. న్యూజిలాండ్ లో జరుగుతున్న సూపర్ స్మాష్ టీ 20 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అలవోకగా ఉన్న చోటు నుండే సిక్సర్లు సంధించగల ప్రతిభావంతుడు. కాబట్టి ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు ఇతనిని కొనుక్కోవడానైకి ఆసక్తిని చూపిస్తున్నారు.
* యువ ఆటగాడు బెన్ మెక్ డెర్మాట్ ప్రస్తుతం ఆస్ట్రేలియన్ క్రికెట్ లో సంచలనం అని చెప్పాలి. ఈ రోజుతో ముగిసిన బిగ్ బాష్ లీగ్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇతనిని కొనడానికి కూడా కోట్లు వెచ్చిస్తాయి ఫ్రాంచైజీలు.
* ఇంగ్లాండ్ కు చెందిన బౌలింగ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ ఆల్రెడీ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టీ 20 లీగ్ లలో రాణిస్తూ తన సత్తా చూపించుకుంటున్నాడు, అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ లో పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. కానీ ఈ సారి భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఫ్రాంచైజీలు ఇతనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి