ఎంతో అనుభవం ఉన్న స్టార్ ప్లేయర్స్ ని వదిలేసి అప్పుడప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్న కుర్రాళ్ళపైనే కన్నీసాయ్ అని ఫ్రాంచైజీలు. దీంతో ఒకప్పుడు 10 కోట్లకు పైగా ధర పలికిన వారు ఇప్పుడు మాత్రం యువ ఆటగాళ్ల కంటే తక్కువ ధర పలకడం గమనార్హం.. ఇలాంటి ఆటగాళ్లలో యువ ఆటగాడు కృష్ణప్ప గౌతమ్ కూడా ఒకరు. గత ఏడాది ఐపీఎల్ మినీ వేలం నిర్వహించగా ఇక ఇందులో యువ ఆటగాడికి ఏకంగా తొమ్మిది కోట్ల ధర చెల్లించి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
అయితే ఈ యువ ఆటగాడు ఆశించిన స్థాయిలో మాత్రం రాణించలేదు. దీంతో ఇతని చెన్నై 9 కోట్లు పెట్టి కొని తప్పు చేసింది అంటూ ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. ఇటీవలే ఇతన్ని మెగా వేలంలో కి వదిలేయగా ఏ జట్టు ఇతని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరచలేదు. ఇక చివరికి ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో ఫ్రాంచైజీ కృష్ణప్ప గౌతమ్ ను దక్కించుకుంది. గతేడాది మినీ వేలం లో ఏకంగా 9 కోట్ల ధర పలికిన ఈ ఆటగాడు ఇప్పుడు మాత్రం ఏకంగా 90 లక్షలకు ధర పలకడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి