బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఇక ఈ ఏడాది ఎలాంటి ఆలస్యం లేకుండా ముందుగా ప్రకటించిన సమయానికి షెడ్యూలు ప్రకారం  మొదలు కాబోతుంది అనే విషయం తెలిసిందే. ఇక బీసీసీఐ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే మునుపటిలా ఎనిమిది జట్లు కాకుండా ఈసారి ఐపీఎల్ లోకి కొత్తగా లక్నో,  గుజరాత్ జట్లు ఎంట్రీ ఇస్తుండడంతో.. మొత్తంగా 10 జట్లు ఐపీఎల్లో హోరాహోరీగా పోరాడేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక ఈ ఏడాది టైటిల్ పోరులో ఎవరు విజయం సాధిస్తారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఇక ఐపీఎల్ లో ప్రతి జట్టు కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధం అయింది. ఇకపోతే ఇప్పటికే ఐపీఎల్లో ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు అన్ని జట్లు వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి అని చెప్పాలి. అయితే ఇక ఈసారి ఐపీఎల్ సరికొత్త ఫార్మాట్ లో ప్రారంభం కాబోతోంది. అదే సమయంలో అన్ని జట్లు కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయ్. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో అన్నీ జట్ల ఫ్రాంచైజీలు తమ సోషల్ మీడియా ఖాతాలో ఇకకొత్త జెర్సీలను విడుదల చేస్తూ ఉండడం గమనార్హం.


 ఇక ఇటీవలే కోల్కతా నైట్రైడర్స్ జట్టు కూడా తమ కొత్త జెర్సీ ని విడుదల చేసింది. సోషల్ మీడియాలో తమ అధికారిక  ఖాతాలో ఇక ఈ వివరాలను వెల్లడించింది. పర్పుల్ గోల్డ్ కలర్ రంగుల్లో ఉన్న జెర్సీ వెనకభాగంలో ఒక ప్రత్యేకమైన వ్యాఖ్యాన్ని  ప్రింట్ వేశారు. గత ఏడాది ఫైనల్ చేరిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లోనే అటు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ ఆడబోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్కతా నైట్రైడర్స్ జట్టు బరిలోకి దిగేందుకు సిద్ధమైంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl