సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలదే హవా నడిచినట్లు.. అటు ఐపీఎల్ లో కూడా కొన్ని జట్లదే ప్రతి సీజన్లో  హవా నడుస్తోంది. ప్రతిసారి ఇక కొన్ని జట్లు మాత్రమే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఎంతో సునాయాసంగా ప్లేఆఫ్ కి అర్హత సాధించడం.. ఇక ఆ తర్వాత ఫైనల్లో అడుగుపెట్టి పోరాడటం.. ఇక కప్పు గెలుచుకోవడం లాంటివి చేస్తుంటాయి. ఇక ఇలాంటి వాటిలో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పటివరకు ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిచింది. అటు చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కువసార్లు ఫైనల్ ఆడిన జట్టుగా కొనసాగుతూనే నాలుగు సార్లు టైటిల్ గెలిచిన జట్టు గా కూడా ఉంది.



 ఇక ప్రతి సీజన్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఇక వరుస విజయాలతో ఎప్పుడూ పాయింట్ల పట్టికలో  టాప్ ప్లేస్ లో ఉండేవి ఈ రెండు జట్లు.  కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా నిరాశ పరుస్తున్నాయ్. దీనంతటికీ కారణం మెగా వేలం అని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు. మొన్నటి వరకు ఆయా జట్ల లోని ఆటగాళ్లు కాకుండా మెగా వేలం కారణంగా ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ లోకి కొత్త ఆటగాళ్లు ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో ఇక ఇతర జట్లలోకి కూడా స్టార్ ప్లేయర్స్ రావడంతో ఎంతో పటిష్టంగా మారిపోయాయి. దీంతో ఇక ఐపీఎల్లో దిగ్గజంగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లకి అనూహ్యమైన సవాళ్లు ఎదురవుతున్నాయి అని తెలుస్తోంది.



 ఇలా మెగా వేలం కారణంగానే ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ సరిగా రాణించలేక పోతున్నాయని అభిమానులు భావిస్తున్నారు. కొత్త ఆటగాళ్ళతో కోఆర్డినేషన్ కాస్త తక్కువగా ఉండటం.. అదే సమయంలో ఇక స్టార్ ప్లేయర్స్ తో  మిగతా జట్లు పటిష్టంగా మారడంతో ఇక గత సీజన్ లాగానే  విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించటం దిగ్గజాలకు కష్టం గా మారిపోయింది. కాగా ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్ చెరో రెండు మ్యాచ్ లు ఆడితే రెండు మ్యాచ్లలో కూడా ఓటమి చవి చూశాయి. ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో చేతిలో చెన్నై ఓడిపోతే.. మరో జట్టు గుజరాత్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి చవిచూసింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl