ముంబై ఇండియన్స్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లోనే విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. బలమైన కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో ఈ జట్టు ప్రతి సారి తలపడుతూ అద్భుతమైన ప్రదర్శన తో  ప్రశంసలు సైతం అందుకుంటుంది. ఇప్పటివరకు ఐపీఎల్ లో అత్యధిక టైటిల్ సాధించిన కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు అని చెప్పాలి. ఇలాంటి ముంబై ఇండియన్స్ ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం చతికిలబడుతుంది. వరుసగా ఆడిన నాలుగు మ్యాచ్ల్లో కూడా పరాజయాలు చవి చూసింది.

 ఎప్పుడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండే ముంబై ఇండియన్స్ ఇక ఈ సారి మాత్రం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతూ ఉండడం గమనార్హం. అయితే ముంబై ఇండియన్స్ కి ఆరంభంలో ఓటములు పలకరించినప్పటికీ ఆ తర్వాత పుంజుకుని చాంపియన్స్ గా నిలిచిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. 2015 ఐపీఎల్ సీజన్ ముంబై ఇండియన్స్ ఇదే పరిస్థితి. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో మాత్రం ఇది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఇక ముంబై ఇండియన్స్ ప్రదర్శనపై అటు మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


 ఇటీవల ఇదే విషయంపై మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.  బూమ్రా మినహా ముంబై ఇండియన్స్ లో మరో నాణ్యమైన బౌలర్ కనిపించడం లేదు. మెగా వేలం నుంచి ధర పలికిన జోఫ్రా ఆర్చర్ వచ్చే సీజన్లో వస్తాడు. మిగతా వారిలో చూసుకుంటే బసిల్ థంపి,జయదేవ్, డేనియల్ సామ్స్,  మిల్స్ చెప్పుకోవడానికి ఉన్నప్పటికీ పెద్దగా రాణించడం లేదు. భారమంతా బుమ్రా మీద పడుతుంది. గతంలో ముంబై పరిస్థితి ఇలా లేదు. మలింగ,  మిక్లగన్ ట్రెంట్ బౌల్ట్ ఇలా ఎవరో ఒక విదేశీ బౌలర్లు ప్రతిసారి అండగా ఉండడం కలిసొచ్చింది. ఇప్పుడు అలాంటి వ్యక్తి కనిపించడం లేదు  ఇక ఇప్పుడు ఇదే ముంబై కెప్టెన్ కి తలనొప్పిగా మారింది అంటూ ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: