ఈ క్రమంలోనే మంచి ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నారు. ఇక ఇలా ఇటీవల కాలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆల్ రౌండర్ గా ఎంట్రీ ఇచ్చాడు రియాన్ పరాగ్. గొప్ప ప్రదర్శన చేయలేదు కానీ ఇక ప్రతి మ్యాచ్ లో నేను ఉన్నాను అనేది మాత్రం చాటుకుంటూ ఉన్నాడు. ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మాత్రమే కాదు టీమిండియా కి కూడా అత్యుత్తమ ఫినిషెర్ గా మారుతాను అంటున్నాడు. 2018 లో అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2019 సీజన్లో రాజస్థాన్ రాయల్స్కు తరఫున ఆరంగేట్రం చేసిన రియాన్ పరాగ్ అదే జట్టుతో కొనసాగుతూ ఉన్నాడు. ఇటీవల జరిగిన ఐపిఎల్ 3.8 కోట్లకు రాజస్థాన్లో అతని కొనుగోలు చేసింది.
ఇటీవలే మ్యాచ్ అనంతరం మాట్లాడిన రియాన్ పరాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా గురించి నేను గొప్పగా చెప్పుకోవాలని ఎప్పుడూ అనుకోను. కానీ నేను రాజస్థాన్ రాయల్స్ కు మాత్రమే కాదు రాబోయే రోజుల్లో భారత జట్టుకు కూడా అత్యుత్తమ ఫినిషర్ గా ఉండగలను అని అనుకుంటున్నాను. నాకు బ్యాటింగ్ ఫీల్డింగ్ బౌలింగ్ లో రాణించే సత్తా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక భారత్ తరపున ఆడే అవకాశం రావాలంటే మరింత రాణించాల్సిన అవసరం ఉంది అని తెలిపాడు. ఇప్పుడు వరకు 34 మ్యాచులు ఆడిన విషయాన్ని 364 పరుగులు చేసి మూడు వికెట్లు పడగొట్టాడు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి