ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర దించారు ఇటీవలే భారత క్రీడాకారులు. కోట్లాది మంది ప్రేక్షకుల గౌరవాన్ని నిలబెట్టారు. ఎంతోమంది ఆకాంక్షను నెరవేర్చారు. ఆ వేదికపై ఒక్కసారైనా భారత్ విజయం సాధించకపోతుందా.. త్రివర్ణ పతాకం రెపరెపలాడక పోతుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు కొత్త ఊపిరి పోశారు. భారత్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. బ్యాట్మెంటన్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన థామస్ కప్  లో జయకేతనం ఎగురవేసింది భారత్. చిరస్మరణీయ ప్రదర్శనతో 14 సార్లు ఛాంపియన్గా నిలిచిన ఇండోనేషియా ను చిత్తుగా ఓడించి విజయఢంకా మోగించింది.


 ఏకంగా లక్ష్య సేమ్ నుంచి కిదాంబి శ్రీకాంత్ వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పెట్టి ఆడారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ అద్భుత విజయంపై ప్రస్తుతం ప్రపంచం మొత్తం హర్షం వ్యక్తం చేస్తుండగా భారతీయుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా భారత్ కు ఒక చారిత్రాత్మక విజయాన్ని అందించిన క్రీడాకారులపై ఎంతో మంది మాజీ క్రీడాకారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదే విషయంపై టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించాడు.


 భారత క్రికెట్ లో తొలిసారి ప్రపంచకప్ ను సాధించిన 1983 సమయంలోనే అద్భుతమైన క్షణాలను ఇక ఈ విజయంతో పోల్చారు సునీల్ గావస్కర్. సైమండ్స్ మరణవార్తతో ఈ ఉదయం చాలా బాధాకరంగా గడిచింది. కానీ మధ్యాహ్నం వరకు ఒక శుభవార్త వచ్చేసింది. థామస్ కప్ విజేతగా భారత్ నిలిచింది. పద్నాలుగేళ్ల ఛాంపియన్ ను మట్టికరిపించి మరి అద్భుత విజయం సాధించి టైటిల్ ముద్దాడింది. ఈ విజయంతో నేను ఆకాశంలో తేలుతున్నట్లు అనిపించింది. నేను బాడ్మింటన్ ఎంతగానో ప్రేమిస్తాను. ఎంతలా అంటే టి20 క్రికెట్ బ్యాడ్మింటన్లో ఏదో ఒకటి చూడాలని నాకు ఛాన్స్ వస్తే నేను తప్పకుండా బ్యాట్మెంటన్ చూడటాన్ని ఎంచుకుంటాను సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: