ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోరు ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. మొన్నటివరకూ ప్లేఆఫ్ లో అవకాశాలు దక్కించుకోవడానికి హోరాహోరీగా పోరాడిన జట్లు ఇక ఇప్పుడు ఇంటి బాట పట్టాయ్. కేవలం నాలుగు జట్లు మాత్రమే ప్లే ఆఫ్ లో  అవకాశం దక్కించుకున్నాయ్. గుజరాత్, రాజస్థాన్, లక్నో, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు మాత్రమే ఇక ప్లే ఆఫ్ లో నిలువగా మిగతా ఆరు జట్లు ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా 10 జట్లతో మొదలైన ఐపీఎల్ పోరు నాలుగు జట్ల వరకు వచ్చింది.


 నేడు ఎంతో కీలకమైన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగబోతుంది అనే విషయం తెలుస్తుంది. ఇక ఈ మ్యాచ్లో ఎవరు గెలిచి ఫైనల్ కు చేరుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.  రాజస్థాన్ గుజరాత్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. అయితే ఇప్పటివరకు ప్లే ఆఫ్ లో అవకాశం దక్కించుకోని జట్లలోని కొంత మంది ఆటగాళ్ల పేర్లు మాత్రం ఇంకా మార్మోగి పోతున్నాయి.. యువ ఆటగాళ్ల ప్రతిభ గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే పంజాబ్ కింగ్స్  లో కీలక బౌలర్ గా ఎదిగిన అర్షదీప్ పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు.


 అర్ష దీప్ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనికి వికెట్లు రాకపోయినప్పటికీ ఎకానమీ  మాత్రం ఎంతో మెరుగ్గా ఉంది అంటు వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. తాను క్రికెట్ ఆడుతున్న సమయంలో జహీర్ ఖాన్ ఆశిష్ నెహ్రా మాత్రమే ఇలాంటి మెరుగైన బౌలింగ్ ప్రతిభను కనబరిచారు అంటూ తెలిపాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇక ఇప్పుడు అర్ష దీప్, జస్ప్రిత్ బూమ్రా, భువనేశ్వర్ కుమార్ లు కూడా డెత్ ఓవర్లలో  మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తున్నారని.. తక్కువ పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్లు  కూడా పడగొడుతున్నారని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl