ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్థానం మొదలు పెట్టింది లక్నో జట్టు. మొదటి నుంచి మంచి ప్రదర్శన కనబరుస్తూ దూసుకుపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్తగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అటు ఛాంపియన్ జట్లకు సైతం దీటుగా పోటీ ఇచ్చింది. ఇక లీగ్ దశలో మంచి విజయాలు అందుకుని అటు ప్లే ఆఫ్ లో నిలిచిన రెండవ జట్టు గా రికార్డు సృష్టించింది. కానీ ఎలిమినేటర్ మ్యాచ్లో మాత్రం ఒత్తిడిని అధిగమించ లేక చివరికి బెంగళూరు జట్టు చేతిలో ఓటమి పాలయింది.


  కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ సమయంలోనూ సహచరులు విఫలమైనప్పటికీ జట్టులోని మిగతా బ్యాట్స్మెన్ ల నుంచి ఎలాంటి సహకారం అందక పోయినప్పటికీ అటు ఒంటరి పోరాటం చేసిన కె.ఎల్.రాహుల్ 79 పరుగులతో మెరిశాడు. అంతేకాదు వరుసగా నాలుగు సీజన్లలో 600 పైచిలుకు పరుగులు సాధించిన తొలి బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. బ్యాట్స్మెన్గా కెప్టెన్ గా సక్సెస్ అయిన కేఎల్ రాహుల్ పై ప్రశంసల వర్షం కురిపించారు అందరూ. కానీ మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ మాత్రం కేఎల్ రాహుల్ పై విమర్శలు చేశారు. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ ప్రదర్శన మెచ్చుకోదగినదే.


 కానీ ఓపెనర్గా వచ్చిన అతను చివరిదాకా నిలబడ్డప్పటికీ  బ్యాటింగ్ లో వేగం తగ్గినట్లు అనిపించింది. హేజిల్ వుడ్ బౌలింగ్లో మంచి బౌండరీలతో అదరగొట్టిన రాహుల్ ఆఖరులో అదే టెంపోను కంటిన్యూ చేయలేకపోయాడు. చివరిదాకా నిలబడాలి అనుకోవడం మంచిది కానీ బ్యాటింగ్ లో కూడా వేగం ఉండడం ఎంతో ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు.  నిన్నటి మ్యాచ్ లో మాత్రం రాహుల్ లో అది లోపించింది  ఒకవేళ తాను  కోచ్ గా ఉండి ఉంటే మాత్రం అతని తప్పకుండా తిట్టే వాడిని.. అతను  కెప్టెన్ గా ఉన్న నిర్ణయాన్ని నేనే చేతుల్లోకి తీసుకునే వాడిని..  ధోని కోహ్లీ లాగా కేఎల్ రాహుల్ కెప్టెన్సీకి అంతగా సూట్ కాలేదు అంటూ సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: