జూన్ 9వ తేదీ నుంచి భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్ ల టి-20 సిరీస్ ఆడబోతుంది టీమిండియా.  ఇక మొదటి టి20 మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియమ్ వేదికగా జరగబోతుంది. అయితే ఇక ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇటీవలే ఐపీఎల్లో రాణించి టీమిండియాలో  అవకాశం దక్కించుకున్న దినేష్ కార్తీక్ అటు మొదటి టి20 లోనే తుది జట్టులో అవకాశం దక్కుతుంది అని అందరూ అనుకుంటున్నారు.. ఇదే జరిగితే మూడేళ్ల తర్వాత దినేష్ కార్తీక్ మళ్లీ జట్టులోకి వచ్చినట్లు అవుతుంది. అదే సమయం లో అరుదైన రికార్డులు కూడా దినేష్ కార్తీక్ సొంతమౌతుంది.



 అదేంటంటే.. దేశం తరఫున మొదటి టి20 మ్యాచ్ ఆడిన జట్టు లో భాగమై ఇంకా టీ20 లో కొనసాగుతున్న ఆటగాడిగా నిలుస్తాడు దినేష్ కార్తీక్. 2006 దక్షిణాఫ్రికాతో భారత్ తొలి టీ-20 మ్యాచ్ ఆడింది.  ఇక ఇప్పుడు అదే జట్టుతో భారత్ 161 మ్యాచ్ ఆడాల్సి ఉంది. 2006లో దక్షిణాఫ్రికా భారత్ తొలి టీ-20 మ్యాచ్ ఆడిన జట్టులో సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్, అజిత్ అగార్కర్, ఇర్ఫాన్ పఠాన్, దినేష్ కార్తీక్ మరియు ఎమ్మెస్ ధోనీ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. జోహన్నెస్బర్గ్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది.


 ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొమ్మిది వికెట్ల నష్టానికి 127 పరుగులు చేయగా ఉత్కంఠభరితంగా జరిగిన  ఈ మ్యాచ్లో ఇండియా విజయం సాధించింది. ఇక దినేష్ కార్తీక్ 28 బంతుల్లో 31 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అయితే ఇలా తొలి టీ20లో ఆడిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లందరూ రిటైర్మెంట్ తీసుకున్నారు. అటు భారత ఆటగాళ్లు కూడా అందరూ రిటైర్ అయ్యారు అని చెప్పాలి. కానీ దినేష్ కార్తీక్ మాత్రం ఇంకా అంతర్జాతీయ టీ20ల్లో కొనసాగుతూనే ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: