ఇటీవలే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరిన టీమిండియా అక్కడ రెండు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల మొదటి టి20 మ్యాచ్ లో మంచి ప్రదర్శన కనబరిచిన టీమిండియా అటు ఐర్లాండ్ పై విజయం సాధించడం గమనార్హం. అయితే అటు టీమిండియా విజయం సాధించడంలో భారత ఆటగాళ్లు అందరూ కూడా తమ వంతు పాత్ర పోషించారు అనే చెప్పాలి. కానీ ఇక ఐర్లాండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా లో సీనియర్ ప్లేయర్ గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్ మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేక ఘోరంగా నిరాశపరిచాడు.


 ఐర్లాండ్ లో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ గా వెనుతిరిగాడు అన్న విషయం తెలిసిందే. దీంతో అతనిపై విమర్శలు కూడా వస్తున్నాయి అని చెప్పాలి. అయితే మొదటి టీ20లో పేలవ ప్రదర్శన చేసిన సూర్యకుమార్ యాదవ్ పై వేటు వేసేందుకు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సిద్ధమయ్యాడు అన్నది తెలుస్తుంది. అతని స్థానంలో ఐపీఎల్ బాగా రాణించిన సంజు శాంసన్ కు తదుపరి మ్యాచ్ లో చాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది


 కాగా ఐపీఎల్లో సంజు శాంసన్ కెప్టెన్సీ లో అటు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్ వరకు వెళ్ళింది. అయితే రాజస్థాన్ ఫైనల్కు చేరుకోవడం లో అటు సంజు పాత్ర ఎంతో కీలకమైనది అని చెప్పాలి. మొత్తంగా 17 మ్యాచుల లో ఏకంగా 458 పరుగులు చేశాడు సంజు శాంసన్. ఈ క్రమం లోనే సూర్య కుమార్ యాదవ్ ప్లేస్ లో అతనికి హార్దిక్ పాండ్యా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఈనెల 28వ తేదీన టీమ్ ఇండియా ఐర్లాండ్ మధ్య రెండో టి20 మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: