భారత్ జట్టు ఆతిథ్య ఇంగ్లాండ్ తో ప్రతిష్టాత్మకమైన టెస్టు సిరీస్ ఆడుతుంది. గత ఏడాది వాయిదా పడిన టెస్టు మ్యాచ్ను ఇక ఇప్పుడు రీషెడ్యూల్ చేయగా ఇరుజట్లు  కూడా ఈ టెస్ట్ మ్యాచ్లో హోరాహోరీగా తలపడుతున్నాయి.  ప్రస్తుతం ఈ టెస్ట్ మ్యాచ్ పోరు ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే టెస్ట్ మ్యాచ్లో భాగంగా మొదటి ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో టీమిండియా కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒక బౌలర్ అయిన బుమ్రా టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ లాగా ప్రదర్శన చేశాడు. ఇక సీనియర్ బౌలర్ అయిన స్టువర్ట్ బ్రాడ్ సందించే వైవిధ్యమైన బంతులను ఎంతో అలవోకగా బౌండరీకి తరలించాడు.


 ఈ క్రమంలోనే టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ లకు సైతం సాధ్యం కాని రీతిలో బుమ్రా టెస్టు ఫార్మాట్లో కేవలం ఒకే ఓవర్లో 29 పరుగులు సాధించాడు. ఈక్రమంలోనే ఒక బౌలర్ అయినప్పటికీ దిగ్గజ బ్యాట్స్మెన్ లకు పోటీ ఇచ్చి ప్రపంచ టెస్ట్ క్రికెట్ లో ఒకే ఓవర్ లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించి అగ్రస్థానంలో నిలిచాడు అని చెప్పాలి. ఇక ఈ ఐదు వైడ్ బాల్స్, ఒక నోబెల్ తో కలుపుకొని మొత్తంగా 35 పరుగులు వచ్చాయి అని చెప్పాలి. ఈ క్రమంలో ఇప్పటివరకూ టెస్టు ఫార్మాట్లో క్రికెట్ లో ఒకే ఓవర్ లో ఎక్కువ పరుగులు చేసిన మిగతా ఆటగాళ్లు ఎవరు అన్నది ఆసక్తికరంగా మారింది.



 ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఒకే ఓవర్లో 29 పరుగులు చేసి ఓలే ఓవర్ లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా టాప్ లో కొనసాగుతున్నాడు బుమ్రా. ఇక ఆ తర్వాత బ్రియాన్ లారా.. రాబిన్ పీటర్సన్ బౌలింగ్లో 2003 సంవత్సరంలో ఒకే ఓవర్ లో 28 పరుగులు చేశాడు. జార్జ్ బెయిలీ జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో 2013లో ఓవర్ లో 28 పరుగులు చేసి ఈ లిస్టు లో కొనసాగుతున్నారు. షాహిద్ ఆఫ్రిది హర్భజన్ సింగ్ బౌలింగ్లో 2006లో ఒకే ఓవర్ లో 27 పరుగులు చేసి ఈ లిస్టులో చోటు దక్కించుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: