గత కొంత కాలం నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సాధించిన ఎన్నో రికార్డులను పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ బాబర్ అజాం బ్రేక్ చేస్తూ వస్తున్నాడు అనే విషయం తెలిసిందే.ఇటీవల కాలంలో మంచి ప్రదర్శన చేస్తున్నాడు అని చెప్పాలి. అయితే సాధారణంగానే పాకిస్తాన్ క్రికెటర్ లు కాస్త అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటిది  రికార్డులు బ్రేక్ చేసిన సమయంలో మరి ఇంత ఓవరాక్షన్ చేయడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్  బాబర్ అజాం కూడా దీనికి అతీతం కాదు అన్న విషయం ఇటీవల తెలిసింది.



 అయితే ఇటువంటి వన్డే టి 20 ఫార్మాట్ లో అత్యధిక కాలం పాటు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగాడు. కానీ ఇటీవలే ఆ రికార్డును బ్రేక్ చేసేసాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజాం.  ఇది  కాకుండా గతంలో కూడా కోహ్లీ పేరిట ఉన్న పలు రికార్డులను బ్రేక్ చేసి తన పేరును లికించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల శ్రీలంకతో టెస్టు సిరీస్కు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో భాగంగా బాబర్ అజాం మీడియా అడిగిన ప్రశ్నలకు కాస్త ఓవర్ యాక్షన్ గా సమాధానం చెప్పాడు అని చెప్పాలి. కోహ్లీ రికార్డు అధిగమించారు కదా మీ ఫీలింగ్ ఏంటి అంటూ ఒక రిపోర్టర్ ప్రశ్నించగా.. ఏ రికార్డ్ అంటూ బాబర్ అజాం రాజస్థాన్ బదులిచ్చాడు.


 ఇక ఆ తర్వాత రిపోర్టర్ గుర్తు చేస్తే.. అత్యధిక కాలం నెంబర్ వన్ స్థానం రికార్డు గుర్తుకువచ్చి.. ఇందుకు నేను దేవుడికి ధన్యవాదాలు చెప్పాలి. అద్భుత ప్రదర్శన వెనుక ఎంతో కఠోరమైన శ్రమ దాగి ఉంది అంటూ సమాధానమిచ్చాడు. అయితే విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టడంతో బాబర్ ఆజమ్ స్పందించిన తీరు మాత్రం అతిగా ఉంది అంటూ అటు భారత అభిమానులు ఫీల్ అవుతూ ఉన్నారు అని చెప్పాలి. సోషల్ మీడియా వేదికగా బాబర్ అజాం పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. బాబర్ అజాం  కాస్త బిల్డప్ ఎక్కువయిందని అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: