ఈ క్రమంలోనే అక్కడ బక్రీద్ పండుగను జరుపుకునేందుకు ఎంతోమంది సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ బక్రీద్ నాడు బలిచ్చేందుకు గొర్రెలను మేకలను తెచ్చుకొని ముందుగానే పెట్టుకుంటారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ కూడా ఇలాంటిదే చేసాడు. బక్రీద్ పండుగ కోసం మేకలను కొన్నాడు. ఇక పండుగ రోజున ఆ మేకలను బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచాడు. కానీ ఆ మేకలపై ఎవరు కన్ను పడిందో... చివరికి ఒక్కసారిగా పండుగ రోజే ఎత్తుకెళ్లారు. దీంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కామ్రాన్ అక్మల్ కి ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి.
అయితే కమ్రాన్ అక్మల్ బక్రీద్ రోజున ఏకంగా ఆరు మేకలు బలి ఇవ్వాలని అనుకున్నాడట. ఈ క్రమంలోనే వాటిని కొనుగోలు చేసి ఇంట్లో ఒక దగ్గర ఉంచాడు. అయితే ఇటీవలే సరిగ్గా బక్రీద్ ముందు రోజు రాత్రి సమయంలో దుండగులు ఒక మేకను ఎత్తుకెళ్లారు. భారీ సెక్యూరిటీ ఉండే ఏరియా లో కూడా ఇలాంటి చోరీ జరగడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ చోరీ అందరినీ కలవరానికి గురి చేస్తోంది. ఈ చోరీపై స్పందించిన హౌసింగ్ సొసైటీ దొంగలను కనిపెట్టి మేకని పట్టుకుంటామని చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి