గత కొంత కాలం నుంచి కోహ్లీ పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశ పరుస్తూనే ఉన్నాడు. విరాట్ కోహ్లీ అటు ఇంగ్లండ్ పర్యటనలో మళ్లీ మునుపటి ఫామ్ లోకి వస్తాడు అని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే ఇక వార్మప్ మ్యాచ్ లలో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీ అసలైన మ్యాచ్ లలో మాత్రం మళ్లీ పేలవమైన ప్రదర్శన కొనసాగించాడు. ఏ ముహూర్తాన ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టాడో కానీ అటు వరుసగా వైఫల్యాలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పుడు వరకు ఆడిన టీమిండియా టెస్ట్ మ్యాచ్, టి 20 సిరీస్, వన్డే మ్యాచ్ అన్నింట్లో జట్టు తరఫున ఆడిన విరాట్ కోహ్లీ.. ఏ మ్యాచ్ లో కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.


 ఇలా రావడం అలా వెళ్లడం అన్నట్లుగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కొనసాగుతుంది అని చెప్పాలి. దీంతో ఎంతో మంది మాజీ క్రికెటర్లు అతని జట్టు నుంచి పక్కన పెట్టాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. భారత మాజీ క్రికెటర్ తో పాటు విదేశీ క్రికెటర్లు సైతం ఈ విషయంపై స్పందిస్తూ కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కానీ కోహ్లీ కి మద్దతుగా నిలుస్తున్న ఆటగాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కాగా కోహ్లీ పేలవమైన ఫాంపై ఇంగ్లాండ్  కెప్టెన్ బట్లర్ సైతం స్పందిస్తూ అతనికి మద్దతుగా నిలిచాడు.


 కోహ్లీ పై వస్తున్న విమర్శలు తనను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అంటూ జాస్ బట్లర్ చెప్పుకొచ్చాడు. కోహ్లీ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్ పై చేయాల్సిన విమర్శలు ఇవి కాదు. అతను చాలా విలువైన ఆటగాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇప్పటికీ కోహ్లీని త్వరగా అవుట్ చేయడాన్ని గొప్పగా భావిస్తామని చెప్పుకొచ్చాడు. అంతే కాదు ప్రతి మ్యాచ్ లో కూడా కోహ్లీ వికెట్ కోసం డ్రెస్సింగ్ రూమ్ లో ప్రత్యేకంగా చర్చిస్తామని.. ఇక అందరికీ లాగానే కోహ్లీకి కెరీర్ కూడా ఎత్తుపల్లాలు చవిచూస్తోంది. ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదు అంటూ తెలిపాడు. కోహ్లీ ఎంత గొప్ప ప్లేయర్ అనే విషయం అతని రికార్డులు చూస్తే తెలిసిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: