ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జట్టు అక్కడ టి20 సిరీస్తో పాటు వన్డే సిరీస్లో కూడా విజయం సాధించిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్లో భాగంగా అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమిండియా రెండు వన్డే మ్యాచ్ లలో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అంతకుముందే టీ20 సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. ఆ తర్వాత వన్డే సిరీస్కు కూడా సొంతం చేసుకుని ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చింది. ఇలా ఇంగ్లండ్ గడ్డపై వన్డే సిరీస్ గెలిచినా టీమిండియా ఇటీవలే ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో కూడా అదరగొట్టింది అన్నది తెలుస్తుంది.
ఇటీవల ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో ఏకంగా దాయాది దేశమైన పాకిస్థాన్ కు షాక్ ఇచ్చింది భారత జట్టు. 106 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతున్న పాకిస్థాన్ జట్టును టీమిండియా వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరింది. ఇటీవల ఇంగ్లాండుపై వన్డే సిరీస్ విజయంతో 109 పాయింట్లు సంపాదించింది ఇండియా. ఈ క్రమంలోనే ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో మూడో స్థానానికి చేరింది అని తెలుస్తోందిమ్ ఈ లిస్టులో న్యూజిలాండ్ జట్టు 128 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతుండగా.. 121 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా 101, సౌత్ ఆఫ్రికా 99, బంగ్లాదేశ్ 98,శ్రీలంక 92 పాయింట్లతో 5 నుంచి వరుస స్థానాల్లో ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి