గత కొంత కాలం నుంచి టీమిండియా వరుసగా సిరీస్ లు కైవసం చేసుకుంటుంది అన్న విషయం తెలిసిందే. ఏ దేశ పర్యటనకు వెళ్లినా కూడా అక్కడ ఆతిథ్య జట్టును ఓడించి ఆధిపత్యం సాధించి చివరికి వరుసగా సిరీస్లను   కైవసం చేసుకుంటుంది. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీ20 వన్డే ఫార్మాట్ ను గెలిచిన టీమిండియా ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు షాకిచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇదే జోరులో అటు వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరింది టీమిండియా జట్టు. అయితే సీనియర్ ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. ఈ క్రమంలోనే శిఖర్ధావన్ కెప్టెన్సీలో బరిలోకి దిగింది.


 ఇక శిఖర్ ధావన్ కెప్టెన్సీలో టీమిండియా అదే విజయాల పరంపర కొనసాగిస్తుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇలాంటి సమయంలోనే ఉత్కంఠ భరితంగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా శుభారంభం చేసింది. కాగాఇక రెండో మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంటుందా లేదా అనుకుంటున్న సమయంలో మరోసారి సత్తా చాటింది. టీం ఇండియా రెండో వన్డే మ్యాచ్ లో కూడా విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆతిథ్య   వెస్టిండీస్ జట్టుకు షాక్ ఇచ్చింది అని చెప్పాలి.


 ఒక మ్యాచ్  మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఏకంగా ఒక ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకుంది. ఓకే జట్టుపై అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్ లలో విజయాలు సాధించిన జట్టుగా టాప్ ప్లేస్ లోకి చేరిపోయింది. టీమిండియా ఇండియా వెస్టిండీస్ పై వరుసగా 11 వన్డే సిరీస్ లు విజయం సాధించింది. అదే సమయంలో పాకిస్థాన్ జట్టు జింబాబ్వేపై 11 వన్డే సిరీస్ లలో గెలిచి రెండు జట్లు అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఇక ఇటీవల వెస్టిండీస్తో మరోసారి వన్డే సిరీస్లో విజయం సాధించిన టీమిండియా12 సిరీస్ లు గెలిచిన జట్టు గా అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: