గత కొంత కాలం నుంచి టీమిండియా యువ ఆటగాళ్లు అందరూ కూడా అదరగొడుతున్నారు అన్న విషయం తెలిసిందే. సాధారణ సమయాల్లో అంతంత మాత్రంగానే ప్రదర్శన చేస్తున్న యువ ఆటగాళ్లు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం  అదరగొడుతున్నారు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో రిషబ్ పంత్ సెంచరీతో అదరగొట్టి వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనలో కూడా ఇలా యువ ఆటగాళ్లు సత్తా చాటుతూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.



 ఇకపోతే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ వన్డే  సిరీస్ లో భాగంగా టీమిండియా మొదటి మ్యాచ్లో విజయం సాధించి అదరగొట్టింది అని చెప్పాలి. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మొదటి మ్యాచ్ లో మూడు పరుగుల తేడాతో  విజయం సాధించింది టీమిండియా. అయితే అటు టీమిండియాకు వెస్టిండీస్ జట్టు తీవ్రమైన పోటీ ఇస్తున్న నేపథ్యంలో 2 వ వన్డే మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తుందా లేదా అన్న భావన అందరిలో కలిగింది. ఇక రెండో వన్డే మ్యాచ్లో భాగంగా ఒకానొక సమయంలో టీమిండియా ఓడిపోయే లాగే కనిపించింది.


 ఇక అలాంటి సమయంలోనే కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకున్నాడు యువ ఆటగాడు అక్షర్ పటేల్. ఆఖరి 10 ఓవర్లలో 100 పరుగులు అవసరమైన సమయంలో ఇక జట్టును తన బ్యాటింగ్తో ఆదుకొని అపురూప విజయాన్ని అందించాడు అని  చెప్పాలి. 35 బంతుల్లో మూడు ఫోర్లు ఐదు సిక్సర్లతో 64 పరుగులు చేసిన జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు. ఇక వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు అక్షర్ పటేల్. రెండో వన్డే మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా దక్కించుకున్నాడు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే  అతని ప్రదర్శనపై ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: