ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది . ఈ పర్యటనలో భాగంగా ఇప్పటికే వన్డే సిరీస్ ముగించుకుంది అనే విషయం తెలిసిందే.  వన్డే సిరీస్లో భాగంగా వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి సత్తా చాటింది.  అటు ఆతిథ్య వెస్టిండీస్ జట్టుతో ఊహించని షాక్ ఇచ్చి క్లీన్ స్వీప్ చేసింది. అయితే వెస్టిండీస్ పర్యటనలో ఏ ముహూర్తానా అడుగుపెట్టిందో కానీ టీమిండియా ఆటగాళ్లకు మాత్రం అస్సలు కలిసి రావడం లేదు. అదేంటి మూడు మ్యాచ్లలో విజయం సాధించింది. సిరీస్ కైవసం చేసుకుంది. క్లీన్ స్వీప్ చేసింది. ఇంతకంటే ఇంకేం అదృష్టం కలిసి రావాలి అనుకుంటున్నారు కదా.. టీమిండియాకు అయితే అదృష్టం కలిసి వస్తుంది కానీ జట్టులోని ఆటగాళ్లు కు వ్యక్తిగతంగా అదృష్టం కలిసి రావడం లేదు.


 అదేంటంటే మొదటి వన్డే మ్యాచ్లో భాగంగా భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన శిఖర్ ధావన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే 97 పరుగుల చేసి సెంచరీ చేసేలాగే కనిపించాడు. కానీ అంతలోనే వికెట్ కోల్పోయి సెంచరీ మిస్ చేసుకొని ప్రేక్షకులను నిరాశ పరిచాడు. దీంతో శిఖర్ ధావన్ సెంచరీ మిస్సయిన విషయం గురించి అందరూ చర్చించుకున్నారు. ఇక ఇప్పుడు మరో ఆటగాడు విషయంలో కూడా ఇదే జరిగింది. భారత జట్టు తరఫున ఓపెనర్ గా బాగా రాణిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు యువ ఆటగాడు శుభమన్ గిల్. మంచి ప్రదర్శన  కూడా చేస్తున్నాడు.


 అయితే ఈ యువ ఆటగాడికి వెస్టిండీస్తో జరిగిన నామమాత్రం అయిన మూడో వన్డే మ్యాచ్లో భాగంగా శిఖర్ ధావన్ కు జరిగినట్లుగానే దురదృష్టం వెంటాడింది. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన శుభమన్ గిల్  98 పరుగులు చేశాడు. దీంతో మరో రెండు పరుగులు చేస్తే సెంచరీ అందుకుంటాడు. ఇక వన్డే క్రికెట్ ఫార్మాట్ లో మొదటి సెంచరీ నమోదు చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ అలాంటి సమయంలో రెండు పరుగుల దూరంలో సెంచరీ కోల్పోయాడు శుభమన్ గిల్.  వర్షం కారణంగా మ్యాచ్ ని 40 ఓవర్లకు కుదించారు.  భారత్ 36 ఓవర్ లలో 225 పరుగులు చేసింది. అయితే డగ్ వర్త్ లూయిస్ పద్ధతిలో 35 ఓవర్లకు 257 గా టార్గెట్ నిర్దేశించగా.. వెస్టిండీస్ టార్గెట్ చేదించ లేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gil