ఇటీవలి కాలం లో ఐపీఎల్లో రాణిస్తున్న ఎంతో మంది యువ ఆటగాళ్లకు అటు భారత జట్టు లో కూడా స్థానం దక్కుతుంది అని చెప్పాలి. అదే సమయం లో కొంత మంది ఆటగాళ్లకు మాత్రం ఎంత ప్రయత్నించినా కూడా భారత జట్టులో చోటు దక్కించు కోలేకపోతున్నారు. ఐపీఎల్లో బాగా రాణించిన కూడా ఎందుకో టీమిండియా లో మాత్రం అవకాశాలు రావడం లేదు అని చెప్పాలి. ఇక ఇలా అవకాశాలు దక్కించుకోలేక నిరీక్షణగా ఎదురు చూస్తున్న బ్యాట్స్మెన్లలో నితీష్ రానా  కూడా ఒకరు.


  టీమిండియా లో చోటు దక్కించుకోవడంపై ఇటీవలే ఒక స్పోర్ట్స్ చానల్ తో మాట్లాడాడు నితీష్ రానా. తాను జాతీయ జట్టు లోకి తిరిగి రావాలనుకుంటున్నాను అని.. తన కల కూడా అదే అంటూ చెప్పుకొచ్చాడు. 2021లో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో శ్రీలంక తో జరిగిన సిరీస్ లో అరంగేట్రం చేసిన నితీష్ రానా 2 టీ20, ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. తర్వాత టీమిండియా తరఫున పెద్దగా ఆకట్టు కోలేకపోయాడు. దీంతో అతన్ని జట్టు నుంచి పక్కన పెట్టారు. మళ్ళీ చోటు దక్కలేదు. ఈ క్రమం లోనే గివ్ అప్ ఇచ్చేది లేదు అంటూ చెబుతున్నాడు నితీష్ రానా. మళ్లీ జట్టులో చోటు సంపాదించడానికి ఎంతో ఆత్మవిశ్వాసం తో ఉన్నా అంటూ చెప్పుకొచ్చాడు.


 అయితే నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. నేను బాగా ఆడలేదు. కాబట్టే జట్టులో స్థానం కోల్పోయాను. ఆ విషయంలో ఎలాంటి సాకులు చెప్పాలి అని అనుకోవట్లేదు. సెలెక్టర్లు నన్ను విస్మరించకుండా ఉండేందుకు వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి ఐదు వందలకు పైగా పరుగులు చేయాలని అనుకుంటున్నా.  నా కంట్రోల్ లో ఉంది ఒక్కటే.. అదే అత్యుత్తమ ప్రదర్శన చేయడం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక వచ్చే సీజన్లో బాగా రాణించడానికి ప్రయత్నిస్తాను. 100% ఎఫర్ట్ పెడతాను అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: