టీమిండియా క్రికెట్ హిస్టరీ లోనే లెజెండరీ కెప్టెన్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు మహేంద్రసింగ్ ధోని . ఇప్పటివరకు ఏ కెప్టెన్ కు కూడా సాధ్యం కాని రీతిలో రెండుసార్లు టీమిండియాకు వరల్డ్ కప్ అందించడమే కాదు ఎన్నో అద్భుతమైన విషయాలను టీమిండియాకు వరించేలా చేశాడు. ఎంతో ఒత్తిడిలో కూడా కూల్ గా కనిపిస్తూ తన చిరునవ్వుతోనే ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు మహేంద్రసింగ్ ధోని. ఈ క్రమంలోనే ధోనీ కెప్టెన్సీ చూసిన తర్వాత అతడు ఒత్తిడిలో కూడా కూల్ గా ఉండడం చూసి అభిమానులు కూడా అలాగే ఉండటం మొదలుపెట్టాడు అనడంలో అతిశయోక్తి లేదు.


 అయితే ధోనీ వ్యూహాలు ఎప్పుడూ ఎవరికీ అర్థం కావు. కొన్నిసార్లు ధోని తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి రిస్కీ నిర్ణయాలు ఎప్పుడూ మంచి ఫలితాన్ని అందిస్తూ ఉంటాయి అనే విషయం తెలిసిందే.  అయితే వికెట్లు వెనకాల ఉంటూ తన వ్యూహాలతో నిమిషాల వ్యవధిలో మ్యాచ్ స్వరూపాన్ని మర్చి తమకు అనుకూలంగా మార్చుకోగల సత్తా ఉన్న కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. ఈ విషయాన్ని అభిమానులు చెప్పడం కాదు ధోని కెప్టెన్సీలో ఆడిన ఎంతో మంది ఆటగాళ్లు ఇప్పటివరకు చెప్పారు.


 ఇటీవలే ధోనీ కెప్టెన్సీలో ఎన్నో ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం ఇటీవల ధోనీ కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో ధోనీ ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. 2011 వరల్డ్ కప్ జరిగిన సమయంలో ఓ సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు హర్భజన్ సింగ్. ఇండియా, పాకిస్తాన్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఉమర్ అక్మల్, మిస్బా ఉల్ హక్ బాగా ఆడుతున్నాడు. అయితే డ్రింక్స్ బ్రేక్ సమయంలో బజ్జి రౌండ్ ది వికెట్ వేయగలవా అంటూ ధోనీ అడిగాడు. అతను చెప్పినట్లే చేసాను. మొదటి బంతికే వికెట్ దక్కింది అంటూ హర్భజన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: