భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ప్రేక్షకుల మధ్య ఎంత ఉత్కంఠ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ దేశంతో మ్యాచ్ జరిగినా కూడా ఎంతో స్పోర్టివ్ గా తీసుకుని భారత ప్రేక్షకులు పాకిస్థాన్తో మ్యాచ్ అంటే చాలు ఎంతో భావోద్వేగంతో ఊగి పోతూ  ఉంటారు అని చెప్పాలి. భారత్కు చిరకాల ప్రత్యర్థిగా కొనసాగుతున్న పాకిస్తాన్ తో క్రికెట్ సంబంధాలపై  నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడ ద్వైపాక్షిక సిరీస్ లు జరగవు. భారత్ పాకిస్తాన్ క్రికెటర్ ల మధ్య ఎలాంటి క్రికెట్ సంబంధిత సమస్యలు ఉండవు అని చెప్పాలి.


 ఇలాంటి సమయంలోనే కేవలం వరల్డ్ కప్ లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి అని చెప్పాలి. దీంతో ప్రేక్షకులు ఈ మ్యాచ్లను ఎంతో ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. కేవలం ఇరు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా భారత్ పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ లను ఆసక్తిగా వీక్షించడం చేస్తూ ఉంటారు. అందుకే ఈ మ్యాచ్ లకు హై వోల్టేజ్ మ్యాచ్లు అని పేరు కూడా ఉంది. మరికొన్ని రోజుల్లో ఆసియా కప్ లో ఆగస్టు 28 వ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్లో ఇటీవల బిసిసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 ఆసియా కప్ టోర్నీలో భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ ని కేవలం ఒక సాదాసీదా మ్యాచ్ గానే చూస్తాం. కానీ ప్రత్యేకంగా ఏమీ లేదు అంటూ పేర్కొన్నాడు. ఇక తాను క్రికెట్ ఆడే సమయంలో కూడా పాకిస్థాన్తో మ్యాచ్ను ఏనాడు కూడా ప్రత్యేకంగా చూడలేదు అంటూ చెప్పుకొచ్చాడు. కేవలం టోర్ని గెలవడం పైనే తన దృష్టి ఉండేది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆసియా కప్లో టీమ్ ఇండియా రాణించి మరోసారి టైటిల్ విజేతగా నిలుస్తుంది అన్న నమ్మకం ఉంది అంటూ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. కాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్..

మరింత సమాచారం తెలుసుకోండి: