దశాబ్దాలు గడుస్తున్నా చిరకాల ప్రత్యర్ధులుగా పిలవబడే భారత్, పాకిస్థాన్ మధ్య జరగబోయే మ్యాచ్ కి ఉన్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు అన్నది ఎప్పటికప్పుడు నిరూపితం అవుతూనే ఉంది అనే చెప్పాలి. గతేడాది టి 20 ప్రపంచకప్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ వోల్టేజి మ్యాచ్  గా నిలిచింది. ఏకంగా ప్రపంచ కప్ మొత్తంలో జరిగిన అన్ని మ్యాచ్ల కంటే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ కి ఎక్కువగా వ్యూస్ వచ్చాయి. దీన్ని బట్టి  ప్రేక్షకులు ఈ మ్యాచ్ ను ఎంతలా ఆస్వాదిస్తారు. ఈ మ్యాచ్ కోసం ఎంతగా ఎదురు చూస్తారూ అన్నది అర్థమైంది.



 ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులందరినీ ఉత్కంఠ తో మునివేళ్ళపై నిలబెట్టే దాయాదుల పోరు జరగబోతుంది. ఆసియా కప్లో భాగంగా ఈనెల 28వ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. అయితే అటు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అన్నది ఇటీవల మరోసారి నిరూపితమైంది. ఈ మ్యాచ్ కి సంబంధించిన టికెట్లు అమ్మకాన్ని ఆగస్టు  15వ తేదీన ప్రారంభించారు నిర్వాహకులు. ఎప్పటిలాగానే నిమిషాల వ్యవధిలోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. టికెట్లు యూఏఈ లో ఎంతో ప్రజాదరణ కలిగిన ప్లాటినం లిస్ట్ అనే వెబ్సైట్కు టిక్కెట్ల అమ్మకాల బాధ్యతలను అప్పజెప్పారు.


 అయితే రాత్రి ఏడున్నర గంటలకు టికెట్లు విడుదల చేయగా 7.5 లక్షల మంది అభిమానులు ఒకేసారి సైట్ పై దండయాత్ర చేశారు. దీంతో సైట్ సర్వర్ డౌన్   కారణంగా విక్రయాలకు కాసేపు అంతరాయం కలిగింది. ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు నిర్వాహకులు క్యూ ఆన్లైన్ పద్ధతిలో అమ్మకాలు  నిర్వహించారు. అయినప్పటికీ  చాలా మంది అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. అయితే టికెట్ల అమ్మకాలు విషయంలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. ఏదేమైనా ఇక ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: