సాధారణంగా భారత్లో క్రికెట్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెటర్లను కేవలం ఒక సాదాసీదా మనుషులుగా కాకుండా ఏకంగా ఎంతో మంది ప్రేక్షకులు  అంతకుమించి అనే రేంజ్ లోనే ఆరాధిస్తూ ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే సమయంలో భారత క్రికెట్ లో గొప్ప సేవలు చేసిన క్రికెటర్లకు బీసీసీఐ కూడా ఎప్పటికప్పుడు అరుదైన గౌరవం ఇవ్వడం లాంటివి కూడా చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో మాజీ క్రికెటర్ల పేర్లు క్రికెట్ స్టేడియం లకి పెడుతూ ఉన్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.


 ఇలాంటివీ చేయడం ద్వారా మాజీ క్రికెటర్లు అందరికీ కూడా అరుదైన గౌరవం ఇస్తూ ఉన్నారు ఎంతోమంది. ఇప్పుడు భారత క్రికెట్ లో ఎన్నో ఏళ్ల పాటు సేవలు అందించి గొప్ప క్రికెటర్గా పేరు సంపాదించుకున్నా యువరాజ్ సింగ్ హర్భజన్ సింగ్ లకు కూడా ఇలాంటి ఒక అరుదైన గౌరవం దక్కింది అని తెలుస్తోంది.  ఇప్పుడు వరకు ఇద్దరూ కూడా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయమైన విషయాలు అందించడంలో కీలక పాత్ర వహించారు. 2007లో టి20 ప్రపంచకప్ 2011లో వన్డే ప్రపంచకప్లో భారత్ నీ విశ్వ విజేతగా నిలవడం లో వీరిది  ప్రముఖ పాత్ర అని చెప్పాలి.


 భారత క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్లుగా ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి గొప్ప క్రికెటర్లకు ఇటీవలే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం గా గుర్తింపు సంపాదించుకున్న మొహాలీ స్టేడియం లోని రెండు స్టాండ్ లక ఇక ఇద్దరు క్రికెటర్ల పేర్లు పెడుతున్నట్లు పంజాబ్ క్రికెట్ సంఘం ఇటీవలే ప్రకటించింది  ఈ నెల 20వ తేదీన భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే తొలి టీ-20 సందర్భంగా ఈ కొత్త పేర్లను ఆవిష్కరిస్తామని తెలిపింది. దీంతో అభిమానులు మురిసిపోతూన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: