ఇటీవల ఇంగ్లాండ్ భారత్ మధ్య జరిగిన వన్డే సిరీస్ లో భారత మహిళల జట్టు వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి ఇంగ్లాండ్ను వైట్ వాష్ చేసేసింది. అయితే మూడో వన్డే మ్యాచ్ లో భాగంగా దీప్తి శర్మ మన్కడింగ్  విధానంలో వికెట్ పడగొట్టింది అన్న విషయం తెలిసిందే. రూల్స్ ప్రకారం ఇది లీగల్ కావడంతో చివరికి అంపైర్ కూడా ఏమి చేయలేక అవుట్ ఇచ్చేసాడు. ఇదే విషయంపై ప్రస్తుతం అటు అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రం తీవ్రస్థాయిలో చర్చ జరుగుతూ ఉండడం గమనార్హం. కొంతమంది దీప్తి శర్మ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించింది అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.


 ఇక మరి కొంతమంది దీప్తి శర్మ క్రికెట్ రూల్స్ ప్రకారమే వికెట్ పడగొట్టింది అంటూ మద్దతుగా నిలుస్తూ ఉండడం గమనార్హం. ఇలాంటి సమయంలోనే టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా తెర మీదకి రావడం గమనాభం. ఎందుకంటే గతంలో ఐపీఎల్ లో జోష్ బట్లర్  ను రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ విధానంలోనే వికెట్ పడగొట్టాడు అన్న విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో గతంలో  అశ్విన్ అవుట్ చేసిన తీరును.. ఇప్పుడు దీప్తి శర్మ మన్కడింగ్ చేసిన తీరును పోల్చుతూ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు దర్శనమిస్తున్నాయి.


 అంతే కాదు దీప్తి శర్మ అశ్విన్ చెల్లెలు అంటూ కొన్ని ఫోటోలను మార్ఫింగ్ చేసి మరి నెటిజెన్లు పోస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక అయితే ఇటీవల  ఇదే విషయంపై టీమ్ ఇండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీరు "అశ్విన్" ను ఎందుకు ట్రెండ్ చేస్తున్నారు. దీప్తి శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసింది అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు అశ్విన్. ఈ క్రమంలోనె అశ్విని పెట్టిన పోస్ట్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇంతకీ దీప్తి శర్మ మన్కడింగ్ చేయడం తప్ప  ఒప్పా.. మీరేమంటారు..

మరింత సమాచారం తెలుసుకోండి: