భారత్ లో బుమ్రా ఎంత కీలకమైన బౌలర్ గా కొనసాగుతూ ఉన్నాడో.. అటు భువనేశ్వర్ కుమార్ కూడా అంతే అనుభవం కలిగిన ప్రతిభవంతుడైన బౌలర్గా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి జోడి ఇండియాకు ఎన్నో విజయాలను అందించింది అని చెప్పాలీ. ఇక అద్భుతమైన బంతులతో బ్యాట్స్మెన్ లకి తికమక పెడుతూ వికెట్లు పడగొట్టడంలో ఇద్దరు బౌలర్లు కూడా సిద్ధహస్తులు అని చెప్పాలి  ఒకవైపు బుమ్రా బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ యార్కర్లతో వికెట్లు పడగొడుతూ ఉంటే మరోవైపు భువనేశ్వర్ కుమారు తన స్వింగ్ బౌలింగ్ తో మాయ చేస్తూ ఉంటాడు.


 ఇకపోతే గాయం బారిన పడిన బుమ్రా మళ్ళీ జట్టులోకి వచ్చి బాగా రాణిస్తున్నాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి టీమ్ ఇండియాతో ప్రయాణం చేస్తున్న భువనేశ్వర్ కుమార్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు అని చెప్పాలి. గతంలో ఆసియా కప్ లో కూడా  ఆఫ్గనిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో మినహా ఏ మ్యాచ్ లో కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు. ముఖ్యంగా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అయినా భువి అదే డెత్ ఓవర్లలోనే భారీగా పరుగులు సమర్పించుకుంటూ ఉండడం గమనార్హం.


 అతనికి కొన్నాళ్లపాటు విశ్రాంతి అవసరమని తర్వాత కోలుకొని మళ్లీ జట్టులోకి వస్తే మునిపటిలా రాణిస్తాడని కొంతమంది మాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు  . కాగా భారతదేశ భువనేశ్వర్ కుమార్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతూ ఉండడంపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజరేకర్ స్పందించాడు. భువనేశ్వర్ కుమార్ ఈ ఏడాది ఎక్కువ మ్యాచ్లు ఆడుతున్నాడని.. అలసట కారణంగానే అతని ఫామ్ తగ్గింది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మూడవ సీమర్ ను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే హర్షల్ పటేల్ ఉన్నప్పటికీ సీమర్ గా అతనికి కొన్ని  లిమిట్స్ ఉన్నాయి. అందుకే మొహమ్మద్ షమీని తీసుకుంటే బాగుంటుంది  అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: