మరి కాసేపట్లో  సౌత్ ఆఫ్రికా తో టీమ్ ఇండియా తొలి టీ20 మ్యాచ్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. కేరళలోని తిరువనంతపురం వేదికగా ఇక ఈ టి 20 మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి   ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే  మొదటి టి20 మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రతి విషయంపై స్పందిస్తూ ఎప్పుడు తన విశ్లేషణ చెప్పే భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా సైతం ఈ విషయంపై స్పందించాడు.


 ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఆకాశ చోప్రా చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి. తిరువనంతపురం వేదికగా జరుగబోతున్న తొలి టి20 మ్యాచ్ లో టీమిండియా  ఓటమిపాలు అవుతుంది అంటూ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్థి జట్టు  సౌత్ ఆఫ్రికాలో మర్కరం, క్వింటన్ డికాక్ రావడంతో జట్టు ఎంతో పటిష్టంగా మారిపోయిందని ఆకాష్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు  అందుకే తొలి టీ20 మ్యాచ్ లో తప్పకుండా సౌత్ ఆఫ్రికా జట్టు విజయం సాధిస్తుంది అంటూ జోష్యం చెప్పాడు. చివరిసారి వచ్చినప్పుడు  జట్టులో మార్కరం లేడు క్వింటన్ డీకాక్ ఒకే ఒక్కడు మ్యాచ్ ఆడాడు.


 కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరూ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. అందుకే అప్పుడు బలహీనంగా కనిపించిన సౌత్ ఆఫ్రికా ఇప్పుడు మాత్రం పటిష్టంగా కనిపిస్తోంది. ఇక ప్రపంచ స్థాయి బౌలర్లతో అటు బౌలింగ్ విభాగం కూడా ఎంతో పటిష్టంగా ఉంది అని చెప్పాలి.  ఇక టీమిండియా విషయానికి వస్తే హార్థిక్ పాండ్యా లేకపోవడంతో జట్టు కాస్త బలహీన పడినట్లు కనిపిస్తుంది. నా అభిప్రాయం ప్రకారం మొదటి మ్యాచ్ లో టీమిండియా తప్పక ఓడిపోతుంది. ఒకవైపు హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడం మరోవైపు డెత్ ఓవర్లలో భారత్ బౌలింగ్ కూడా ఆందోళన కలిగిస్తున్న  నేపథ్యంలో ఇండియా ఓటమి ఖాయం అంటూ జోష్యం చెప్పాడు ఆకాష్ చోప్రా.

మరింత సమాచారం తెలుసుకోండి: