సాధారణంగా గల్లి క్రికెట్లో ఎంపైర్లుగా వ్యవహరించేవారు కొన్ని కొన్ని సార్లు తప్పుడు నిర్ణయాల ద్వారా మ్యాచ్ ను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే  తమకు నచ్చిన వారికి మ్యాచ్ ఫేవర్ గా మారే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు  అయితే అటు ప్రొఫెషనల్ క్రికెట్లో మాత్రం ఇలాంటివి ఎక్కడ జరగవు. టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎంపైర్లు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి తమ నిర్ణయాలను వ్యక్తపరచడానికి అవకాశం ఉంటుంది.


 మొన్నటి వరకు అంతా ఇలాగే ఉండేది. కానీ ఇటీవల కాలంలో మాత్రం అంపైర్లు తప్పుడు నిర్ణయాలతో ఎంతోమంది ఆటకాళ్లకు అన్యాయం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. సరికొత్త టెక్నాలజీతో పూర్తిగా క్షుణ్ణంగా గమనించినప్పటికీ తప్పుడు నిర్ణయాల కారణంగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తున్నారు అంపైర్లు. ప్రొఫెషనల్ క్రికెట్లో ఇలాంటి తప్పులు గత కొంతకాలం నుంచి కాస్త ఎక్కువగానే జరుగుతున్నాయి అని చెప్పాలీ. ఆసియా కప్ లో కూడా ఇలాంటిదే జరిగింది. ఆసియా కప్ మహిళల టి20 టోర్నీలో టీమిండియా మహిళల జట్టు శుభారంభం చేసింది.


 శ్రీలంక ఉమెన్స్ టీం తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఏకంగా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.  జేమియా రోడ్రిక్స్ బ్యాటింగ్లో మెరుపులు మెరిపించగా బౌలర్లు సమిష్టిగా రాణించారు. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా థర్డ్ అంపైర్ చీటింగ్ చేశాడు. దీంతో భారత క్రికెటర్ పూజ వస్త్రాకర్ అన్యాయంగా వికెట్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూజ వస్త్రాకర్ కవర్స్ దిశగా షాట్ ఆడింది. సింగిల్ పూర్తి చేసిన పూజ రెండో పరుగు కోసం ప్రయత్నించింది. ఇంతలో ఇక ఫీల్డర్ బంతిని కీపర్ కు విసిరింది. పూజ క్రీజులో బ్యాట్ పెట్టగానే కీపర్ బయిల్స్ ఎగరగొట్టింది. రిప్లై లో చూస్తే పూజ క్రీజు చేరినట్లు స్పష్టంగా కనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం అవుట్ గా ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: