మొన్నటికి మొన్న పురుషుల ఆసియా కప్ టోర్నీ ముగిసిందో లేదో ఇక ఇప్పుడు కొన్ని రోజుల గ్యాప్ లోనే మళ్లీ మహిళల ఆసియా కప్ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఆసియా కప్ లో భాగంగా అటు ప్రతి మ్యాచ్ కూడా ఎంతో రసవత్తరంగా సాగుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో కూడా అదిరిపోయే ప్రదర్శన చేస్తున్న భారత జట్టు వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది అని చెప్పాలి. మొన్నటి వరకు ద్వైపాక్షిక సిరీస్లలో సత్తా చాటిన టీమిండియా ఇక ఇప్పుడు ఆసియా కప్ లో కూడా అదే రీతిలో ప్రదర్శన చేస్తుంది.


 ఆసియా కప్ లో భాగంగా ఇటీవల వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించింది భారత మహిళల జట్టు. ఈ క్రమంలోనే ఇటీవలే భారత మహిళల జట్టు ఆడిన రెండో వ టీ20 మ్యాచ్ లో భాగంగా తెలుగమ్మాయి మేఘన బ్యాటింగ్ తో అదరగొట్టింది అని చెప్పాలి. 53 బంతుల్లోనే 69 పరుగులు చేసింది. ఇందులో 11 ఫోర్లు ఒక సిక్సర్ ఉండడం గమనార్హం. మేఘన అద్భుతమైన మెరుగు బ్యాటింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర వహించింది. భారత జట్టు డక్ వర్క్ లూయిస్ పద్ధతిలో 30 పరుగుల తేడాతో మలేషియా పై విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసింది భారత జట్టు. ఈ క్రమంలోనే నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోరు చేసింది.


 ఓపెనర్లు మేఘన, శపాలి వర్మ దాటిగా ఆడారు చెప్పాలి.  శఫాలి వర్మ  39 బంతుల్లో 46 పరుగులు చేయగా.. ఇక తెలుగమ్మాయి మేఘన 38 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే 12 ఓవర్లలో భారత్ స్కోరు 100 ఉండడం గమనార్హం. ఇక 13.5 ఓవర్ల వరకు ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత రిఛా గోష్ 19 బంతుల్లో 33 నాట్ అవుట్ గా నిలిచింది. ఇకపోతే భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా 5.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది. ఆ తర్వాత మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోవడంతో డక్ వర్త్ లూయిస్  పద్ధతిలో ఇక 5.2 ఓవర్లో 47 పరుగులు చేయాల్సి ఉండగా.. 16 పరుగులు చేయడంతో 30 పరుగులు తేడాతో టీమిండియా విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: