ఇలాంటి సమయంలో ఇండియా జట్టులో సీనియర్ ప్లేయర్లుగా కొనసాగుతూ అప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన వారు సైతం ఇక యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు తమని తామును నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమాత్రం పేలవమైన ఫామ్ కనబరిచిన వారిని తీసి పక్కన పెట్టేస్తున్న పరిస్థితులు కూడా చూస్తూనే ఉన్నాము. అయితే ఇలా ఇటీవల కాలంలో టీమిండియాలో అవకాశం దక్కించుకొని ఆడింది కొన్ని మ్యాచ్లే అయినా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ కూడా ఒకరు.
టీమ్ ఇండియాలో అడపా అవకాశాలు వచ్చిన అవకాశాన్ని మాత్రం బాగా సద్వినియోగం చేసుకున్నాడు. ఇక ఇటీవల సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో అరంగేట్రం చేశాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆల్రౌండర్ షాబాద్ అహ్మద్ తండ్రి స్పందిస్తూ తన కొడుకుతో చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు. క్రికెట్ కోసం నువ్వు చదువును మధ్యలోనే ఆపేసి కోల్కతా వెళ్లడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే ఏదైనా పెద్దగా సాధించు.. లేకపోతే ఇంటి ముఖం కూడా చూడకు అంటూ నా కొడుకుని హెచ్చరించాను అంటూ తెలిపాడు. ఇప్పుడు ఇక తన కొడుకు టీమ్ ఇండియా తరపున ఆడుతుండడం ఎంతో గర్వంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి